పోస్ట్‌లు

విశ్వకవి నడయాడిన నేల...

చిత్రం
  రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఏయూ ఘననివాళి    విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని  ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘన నివాళులర్పించింది. ఏయూలోని డాక్టర్ వి ఎస్ కృష్ణ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న ఆయన విగ్రహానికి  చీఫ్ లైబ్రేరియన్  ఆచార్య వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదని రచయిత, చిత్రకారుడు, తత్వవేత్త, విద్యావేత్త,  గొప్ప మానవతావాది అన్నారు.  సాహిత్య రంగంలో అసాధారణ ప్రతిభ చూపించి విశ్వవ్యాప్తంగా భారత ఖ్యాతిని చాటారన్నారు.  ఆయన సాహిత్య రచనలతో విశ్వకవి అనే బిరుదును సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. గీతాంజలి ద్వారా సమాజ శ్రేయస్సును, దేశభక్తిని చాటారని కొనియాడారు. ప్రేమ, శాంతి, మానవతా విలువలతో కూడిన ఆయని రచనలు ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఆయన కలలు కన్న భారతదేశాన్ని నిర్మించుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్ర తొలినాళ్లలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం, ఇక్కడి విద్యావేత్తలకు, విద్యార్థులకు దేశ ప్రగతి పై దేశానిర్దేశం చేయడం ...

విశ్వకవి జయంతి నిర్వహణ

చిత్రం
 ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి నిర్వహణ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని బుధవారం నిర్వహించారు.  ఏయూ న్యాయ కళాశాలలోని రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ నోబెల్ బహుమతిని భారతదేశానికి అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం నుంచి యువత స్ఫూర్తిని  పొందాలని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను చదవాలని సూచించారు. ఆంధ్ర  విశ్వవిద్యాలయంతో రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు  చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్  ధనుంజయరావు, ప్రిన్సిపాల్ ఆచార్య కె. సీతామాణిక్యం, డి నగరాజకుమారి,  పద్మశ్రీ,  ప్రవేశాల  సంచాలకులు డి.ఎ. నాయుడు, డాక్టర్ టి షారోన్ రాజు, డాక్టర్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరికి ఘన నివాళులు

చిత్రం
అల్లూరికి ఘన నివాళులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఏయు న్యాయ కళాశాల  పక్కనే ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకువచ్చి, ప్రజలలో  స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి బ్రిటిష్ వారిపై పోరాటాన్ని చేసిన స్వాతంత్ర సమరయోధుడు  అల్లూరి జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. విశాఖ జిల్లాతో అల్లూరికి  ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్  ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్ ధనుంజయరావు, ప్రిన్సిపాల్ ఆచార్య కె.  సీతామాణిక్యం, డి నగరాజకుమారి, ప్రవేశాల సంచాలకులు డి ఎ నాయుడు, డాక్టర్ టి షారోన్ రాజు, డాక్టర్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి జీవిత విశేషాలను న్యాయ కళాశాల ప్రిన్సిపాల్  సీతామాణిక్యం వివరించారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

చిత్రం
  విద్యా విభాగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని నిర్వహించారు.ముందుగా రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు పూలమాలవేసిఅంజలి ఘటించారు. విద్యారంగానికి రవీంద్రనాథ్ ఠాగూర్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ప్రకృతి వాతావరణంలో స్వేచ్ఛగా విద్యను అభ్యసించాలని రవీంద్రనాథ్ ఠాగూర్భావించే వారిని ఇదే విధానాన్ని నేచురలిజం పేరుతో ఆయన ప్రతిపాదించారని చెప్పారు. నేటికీ బీఈడీ, ఎంఈడి విద్యార్థులకు ఠాగూర్ తత్వాన్ని, ఆలోచనలను అందించడం జరుగుతుందని వివరించారు. ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ విద్యారంగానికి ఒక మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించి ద మేన్ అనే ప్రత్యేక ఉపన్యాసాన్ని అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా విభాగం ఆచార్యులు డాక్టర్  ప్రకాష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ పుష్పరాజ్యం, డాక్టర్ సౌమ్య హవేల, డాక్టర్ ప్రవీణ విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

పోషకాల సమాహారం.... కాలిఫోర్నియా బాదం...

చిత్రం
    కాలిఫోర్నియా బాదం యొక్క పోషకాల తో  ... అమ్మ ఆరోగ్యాన్ని వేడుకగా జరుపుకోండి...   అమ్మ , ప్రతిరోజూ ఇచ్చే అంతులేని ప్రేమ , సంరక్షణ మరియు నిశ్శబ్ద బలాన్ని ఏ ఒక్కరూ భర్తీ చేయలేరు. మనం తిన్నామా అని అడగడం నుండి అందరూ బాగున్నారా అని నిర్ధారించుకోవడం వరకు , అమ్మ , ఎల్లప్పుడూ ఇతరులకు ప్రాధాన్యత ఇస్తోంది. కానీ , మనం వారు ఎలా ఉన్నారో అడగడం దగ్గరే ఆగిపోతుంటాము. ఈ మాతృదినోత్సవ వేళ ,  అమ్మను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా వేడుక జరుపుకుందాం. ఇందుకు ఒక ఆలోచనాత్మక మార్గం కాలిఫోర్నియా బాదంను ఆమె దినచర్యలో భాగం చేయడం.   గింజల రాజుగా పిలువబడే కాలిఫోర్నియా బాదం , ప్రోటీన్ , జింక్ , మెగ్నీషియం మరియు విటమిన్ ఇ వంటి 15 ముఖ్యమైన పోషకాలకు సహజ వనరు. ఆమె దినచర్యలో కొన్ని బాదం పప్పులను జోడించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం తో పాటుగా , గుండె ఆరోగ్యానికి మద్దతు అందిస్తుంది , మెరిసే చర్మానికి , బరువు నిర్వహణకు మరియు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఫిట్‌నెస్ మరియు సెలబ్రిటీ బోధకురాలు యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ , “ శిక్షణ పొందే చాలా మంది తరచుగా వ్యాయామానికి ముందు లే...

వైజాగ్ ఎక్స్ పో లో నయాగరా జలపాతం

చిత్రం
  విశాఖ వాసుతులకు సరికొత్త ఆకర్షణ సిద్ధం   బీచ్ రోడ్ లో సిద్ధమైన నయాగరా జలపాతం   - ఇప్పటికే జలకన్యలతో నగరవాసులను ఆకట్టుకున్న వైజాగ్ ఎక్స్ పో - వేసవి నేపథ్యంలో సరికొత్త ఆకర్షణలతో ప్రజల ముందుకు  - టికెట్ ధరలో ప్రత్యేక తగ్గింపు  విశాఖపట్నం మే 7:  విశాఖ వాసులను, నగరానికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ఒక మరొక ప్రత్యేక ఆకర్షణ సిద్ధమైంది. బీచ్ రోడ్ లో పోలీస్ మెస్ వెనుక భాగంలో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్ పో లో నయాగరా జలపాతం నమూనా ప్రజలను అలరించడానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం దీనిని నిర్వాహకులు ప్రారంభించారు. 30 అడుగుల ఎత్తు, 181 అడుగుల వెడల్పు కడిగిన నయాగరా జలపాతం నమూనాను ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పైనుంచి వేగంగా పడుతున్న నేటి ప్రవాహం రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎంతగానో  ఆకర్షిస్తోంది. వేసవి నేపథ్యంలో విశాఖ వాసులను, నగరానికి వచ్చే పర్యాటకులను, ముఖ్యంగా చిన్నారులను మరింత అలరించే విధంగా దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు.  ఇప్పటికే జలకన్యలతో విశాఖలో చిన్నారులను...

సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నగరానికి వచ్చేసింది

చిత్రం
ఉన్నతశ్రేణి వేసవి దుస్తుల ప్రదర్శన విశాఖపట్నం, 3 మే 2025: విశాఖ వాసుల వేసవి ఎండను చల్లబరచుటకు సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ విశాఖ నగరానికి వచ్చేసింది. ఈ రోజు నగరంలోని నోవాటేల్ హోటల్ నందు సూత్రా వారు అద్భుతమైన ఫ్యాషన్ దుస్తులతో పాటు హాయినిచ్చే వేసవి దుస్తుల ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శన మరియు అమ్మకాలు మే 3 మరియు 4 తేదీలలో రెండు రోజులు మాత్రమే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల సాంప్రదాయ మరియు ఆధునిక వస్త్రాలు ప్రతి వేడుకకు అవసరమైనవి ఈ ప్రదర్శనలో లభిస్తాయి. ఈ సూత్రా ప్రదర్శనను శ్రీ ఉమేష్ మాద్యం, మేనేజింగ్ డైరక్టర్, సూత్రా గారితో కలసి కె. నీలిమ, లక్ష్మి పత్తి, సునీత దుగార్, మరియు రచన సంచిత సంయుక్తంగా ఈరోజు ప్రారంభించారు. వేసవి సూర్యుని తాపాన్ని చల్లబరిచి మీకు అత్యంత ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని అందించే ఎన్నో దుస్తులు ఈ ప్రదర్శనలో నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. మీరు ఆశించిన విధంగా మరియు మీ కలలను సాకారం చేసే పలు రకాల ఆకర్షణీయమైన వస్త్ర సంపదను మీరు ఇక్కడ పొందవచ్చును. డిజైనర్స్ పని నైపుణ్యత నిండిన వస్త్రాలు, సూర్యకాంతిని మించిన ఆభరణాల...