అల్లూరికి ఘన నివాళులు
అల్లూరికి ఘన నివాళులు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఏయు న్యాయ కళాశాల పక్కనే ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకువచ్చి, ప్రజలలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి బ్రిటిష్ వారిపై పోరాటాన్ని చేసిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. విశాఖ జిల్లాతో అల్లూరికి ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్ ధనుంజయరావు, ప్రిన్సిపాల్ ఆచార్య కె. సీతామాణిక్యం, డి నగరాజకుమారి, ప్రవేశాల సంచాలకులు డి ఎ నాయుడు, డాక్టర్ టి షారోన్ రాజు, డాక్టర్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి జీవిత విశేషాలను న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ సీతామాణిక్యం వివరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి