వైజాగ్ ఎక్స్ పో లో నయాగరా జలపాతం
విశాఖ వాసుతులకు సరికొత్త ఆకర్షణ సిద్ధం
బీచ్ రోడ్ లో సిద్ధమైన నయాగరా జలపాతం
- ఇప్పటికే జలకన్యలతో నగరవాసులను ఆకట్టుకున్న వైజాగ్ ఎక్స్ పో
- వేసవి నేపథ్యంలో సరికొత్త ఆకర్షణలతో ప్రజల ముందుకు
- టికెట్ ధరలో ప్రత్యేక తగ్గింపు
విశాఖపట్నం మే 7: విశాఖ వాసులను, నగరానికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ఒక మరొక ప్రత్యేక ఆకర్షణ సిద్ధమైంది. బీచ్ రోడ్ లో పోలీస్ మెస్ వెనుక భాగంలో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్ పో లో నయాగరా జలపాతం నమూనా ప్రజలను అలరించడానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం దీనిని నిర్వాహకులు ప్రారంభించారు. 30 అడుగుల ఎత్తు, 181 అడుగుల వెడల్పు కడిగిన నయాగరా జలపాతం నమూనాను ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పైనుంచి వేగంగా పడుతున్న నేటి ప్రవాహం రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎంతగానో ఆకర్షిస్తోంది. వేసవి నేపథ్యంలో విశాఖ వాసులను, నగరానికి వచ్చే పర్యాటకులను, ముఖ్యంగా చిన్నారులను మరింత అలరించే విధంగా దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు.
ఇప్పటికే జలకన్యలతో విశాఖలో చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ వైజాగ్ ఎక్స్ పో లో వేసవి దృష్ట్యా సరికొత్త ఆకర్షణలతో నగరవాసులకు ఆహ్వానం పలుకుతోంది. టికెట్ రుసుమును 150 రూపాయల నుంచి కేవలం 100 రూపాయలకే పరిమితం చేసినట్లు తెలిపారు. ఎక్కువ శాతం మంది విశాఖవాసులు వీటిని వీక్షించడానికి వీలుగా ప్రవేశ రుసుములో రాయితీ కల్పిస్తున్నారు. వైజాగ్ ఎక్స్ పో ప్రవేశం, జలకన్యలు, కాశ్మీర్ సిటీ, నయాగరా జలపాతం వంటివి వీక్షించడానికి కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలందరికి సంతోషాన్ని, ఆనందాన్ని అందించే ఒక ప్రత్యేక ప్రాంగణంగా దీనిని తీర్చిదిద్దనట్లు చెప్పారు.
చిన్నారులను ఎంతగానో ఆకట్టుకునే విభిన్న రైడ్లు మహిళలకు సైతం ఆకర్షించే వస్త్ర, ఆభరణాల స్టాల్స్ కుటుంబ సమేతంగా సంతోషాన్ని పంచుకునే వేదికగా రుచికరమైన వంటకాలతో విశాఖ ఎక్స్ పో నగరవాసులను సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి