విశ్వకవి జయంతి నిర్వహణ

 ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి నిర్వహణ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని బుధవారం నిర్వహించారు. ఏయూ న్యాయ కళాశాలలోని రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ నోబెల్ బహుమతిని భారతదేశానికి అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం నుంచి యువత స్ఫూర్తిని పొందాలని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను చదవాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్ ధనుంజయరావు, ప్రిన్సిపాల్ ఆచార్య కె. సీతామాణిక్యం, డి నగరాజకుమారి, పద్మశ్రీ, ప్రవేశాల సంచాలకులు డి.ఎ. నాయుడు, డాక్టర్ టి షారోన్ రాజు, డాక్టర్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న