రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

 విద్యా విభాగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని నిర్వహించారు.ముందుగా రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు పూలమాలవేసిఅంజలి ఘటించారు. విద్యారంగానికి రవీంద్రనాథ్ ఠాగూర్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ప్రకృతి వాతావరణంలో స్వేచ్ఛగా విద్యను అభ్యసించాలని రవీంద్రనాథ్ ఠాగూర్భావించే వారిని ఇదే విధానాన్ని నేచురలిజం పేరుతో ఆయన ప్రతిపాదించారని చెప్పారు. నేటికీ బీఈడీ, ఎంఈడి విద్యార్థులకు ఠాగూర్ తత్వాన్ని, ఆలోచనలను అందించడం జరుగుతుందని వివరించారు. ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ విద్యారంగానికి ఒక మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించి ద మేన్ అనే ప్రత్యేక ఉపన్యాసాన్ని అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా విభాగం ఆచార్యులు డాక్టర్  ప్రకాష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ పుష్పరాజ్యం, డాక్టర్ సౌమ్య హవేల, డాక్టర్ ప్రవీణ విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న