విశ్వకవి నడయాడిన నేల...
రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఏయూ ఘననివాళి
విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘన నివాళులర్పించింది. ఏయూలోని డాక్టర్ వి ఎస్ కృష్ణ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న ఆయన విగ్రహానికి చీఫ్ లైబ్రేరియన్ ఆచార్య వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదని రచయిత, చిత్రకారుడు, తత్వవేత్త, విద్యావేత్త, గొప్ప మానవతావాది అన్నారు. సాహిత్య రంగంలో అసాధారణ ప్రతిభ చూపించి విశ్వవ్యాప్తంగా భారత ఖ్యాతిని చాటారన్నారు. ఆయన సాహిత్య రచనలతో విశ్వకవి అనే బిరుదును సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. గీతాంజలి ద్వారా సమాజ శ్రేయస్సును, దేశభక్తిని చాటారని కొనియాడారు. ప్రేమ, శాంతి, మానవతా విలువలతో కూడిన ఆయని రచనలు ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఆయన కలలు కన్న భారతదేశాన్ని నిర్మించుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్ర తొలినాళ్లలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం, ఇక్కడి విద్యావేత్తలకు, విద్యార్థులకు దేశ ప్రగతి పై దేశానిర్దేశం చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి ఎస్ కృష్ణ సెంట్రల్ లైబ్రరీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి