సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నగరానికి వచ్చేసింది

ఉన్నతశ్రేణి వేసవి దుస్తుల ప్రదర్శన

విశాఖపట్నం, 3 మే 2025: విశాఖ వాసుల వేసవి ఎండను చల్లబరచుటకు సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ విశాఖ నగరానికి వచ్చేసింది. ఈ రోజు నగరంలోని నోవాటేల్ హోటల్ నందు సూత్రా వారు అద్భుతమైన ఫ్యాషన్ దుస్తులతో పాటు హాయినిచ్చే వేసవి దుస్తుల ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శన మరియు అమ్మకాలు మే 3 మరియు 4 తేదీలలో రెండు రోజులు మాత్రమే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల సాంప్రదాయ మరియు ఆధునిక వస్త్రాలు ప్రతి వేడుకకు అవసరమైనవి ఈ ప్రదర్శనలో లభిస్తాయి. ఈ సూత్రా ప్రదర్శనను శ్రీ ఉమేష్ మాద్యం, మేనేజింగ్ డైరక్టర్, సూత్రా గారితో కలసి కె. నీలిమ, లక్ష్మి పత్తి, సునీత దుగార్, మరియు రచన సంచిత సంయుక్తంగా ఈరోజు ప్రారంభించారు.

వేసవి సూర్యుని తాపాన్ని చల్లబరిచి మీకు అత్యంత ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని అందించే ఎన్నో దుస్తులు ఈ ప్రదర్శనలో నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. మీరు ఆశించిన విధంగా మరియు మీ కలలను సాకారం చేసే పలు రకాల ఆకర్షణీయమైన వస్త్ర సంపదను మీరు ఇక్కడ పొందవచ్చును. డిజైనర్స్ పని నైపుణ్యత నిండిన వస్త్రాలు, సూర్యకాంతిని మించిన ఆభరణాల ధగ ధగలు మరియు వేసవిని ఉపశమించు ఉపకరణాలు విస్తృతంగా ఈ ప్రదర్శనలో మీరు చూడవచ్చును. అందుకే ఈ వేసవిలో ఈ ప్రదర్శనను మీరు తప్పక దర్శించాలని నిర్వాహకులు చెపుతున్నారు. అన్ని రకాల విశిష్ట వస్త్రాలు ఒకే చోట లభించు ప్రదేశం ఈ సూత్రా ప్రదర్శన. పండుగలు మరియు వివాహాలకు అవసరమైన అన్ని సంప్రదాయ వస్త్రాలు మరియు ఫ్యాషన్ దుస్తులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. సూత్రా వస్త్రాలు మీ వేడుకలను మరింత వైభవంగా రూపొందిస్తాయి.

దేశంలోని పేరొందిన ఎందరో డిజైనర్స్ మరియు వస్తువుల తయారీదారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. సాఖ యూనిక్ క్లాతింగ్, విమా దిలీప్, అపురూప, అన్వయ వేవ్స్, క్రియేటివ్ హాబ్స్, మరియు మహాలక్ష్మి జ్యుయలర్స్, ఇంపీరియల్ తారా జ్యుయలరీ, ఆర్కే కలెక్షన్స్, కోల్ కతా వంటి సంస్థలు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో మీకు అందుబాటులో ఉంచాయి. మీరు బంధు మిత్రులతో కలసి రండి మరపురాని వేసవి షాపింగ్ అనుభూతిని పొందవచ్చును అంటున్నారు సూత్రా నిర్వాహకులు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న