విశాఖ నగరంలో “అమెజాన్ నౌ” ఆల్ట్రా-డెలివరీ సేవలు ఆవిష్కరణ

 విశాఖ నగరంలో “అమెజాన్ నౌ” ఆల్ట్రా-డెలివరీ సేవలు 

విశాఖపట్నం 30 సెప్టెంబర్ 2026 : ఇప్పుడు విశాఖ నగరంలో అమెజాన్ డెలివరీ సేవలు మరింత వేగవంతం. కిరాణా సామగ్రి, ఫ్యాషన్ సౌందర్య వస్తువులు, గృహ మరియు వంటగది సంబంధిత సామాగ్రి వంటి వేలాది ఉత్పత్తులను నిముషాల వ్యవధిలోనే డెలివరీ చేసే ఆల్ట్రా డెలివరీ అమెజాన్ నౌ  విధానం నేడు అమెజాన్ ఆవిష్కరించినది. విశాఖ నగరంలో అత్యంత ఆదరణ కలిగిన పండ్లు, కూరగాయలు, పాలు, ప్రీమియం వంట నూనెలు, నెయ్యి, చాక్లెట్స్, బ్రెడ్, నట్స్ వగైరా నిముషాల వ్యవధిలో డెలివరీ చేస్తారు.

అక్టోబర్ 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా వినియోగదారులకు అమెజాన్ నౌ అద్భుతమైన ఆకర్షణీయమైన అనేక ఆఫర్లు అందిస్తున్నాది. డ్రై ఫ్రూట్స్, నట్స్‌కు డిమాండ్ 60% పెరిగింది. బాదంపప్పు  ప్రస్తుతం ప్రతి పది ఆర్డర్లలో ఒక ఆర్డర్‌లో నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ ఉంటున్నాయి. సెనగపిండి, రవ్వ, సేమియా స్వీట్స్ తయారీకి ఉపయోగించే పదార్థాలకు 40% , పూజా సామగ్రి  35%, చాక్లెట్లు, స్వీట్లు, గిఫ్ట్ ప్యాక్‌లకు 30% చొప్పున డిమాండ్  పెరిగింది. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో  బెల్లం, షుగర్-ఫ్రీ స్వీటెనర్లు, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్-వీట్ బ్రెడ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. రైస్ బ్రాన్ ఆయిల్  విశాఖపట్నంలో అత్యధికంగా ఆర్డర్ చేస్తున్న ఉత్పత్తుల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ శ్రీరాం, డైరక్టర్, అమెజాన్ ఇండియా ఎవ్విరి డే ఎసన్షియల్ విభాగం వారు మాట్లాడుతూ   అమెజాన్ నౌ ను విశాఖపట్నంలో ప్రవేశపెట్టటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. కిరాణా నిత్యావసరాల నుంచి ప్రీమియం ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన ఎంపికల వరకు రోజువారీ అవసరాలను త్వరితగతిన పొందేందుకు అమెజాన్ నౌ ఉపయుక్తం అన్నారు. దేశవ్యాప్తంగా మేము అమెజాన్ నౌ  ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయి. పండుగ సీజన్‌కు ముందే నిమిషాల్లో డెలివరీ సేవలను భారతదేశంలోని 65కి పైగా నగరాలు, పట్టణాలకు విస్తరించింది. దీపావళి నాటికి 100 నగరాలకు విస్తరించే దిశగా మేము ముందుకు సాగుతున్నాం. విశాఖపట్నంలోని వినియోగదారులు గత దశాబ్ద కాలంగా అమెజాన్ అందిస్తున్న వేగం, విలువ, విస్తృత ఎంపికలు, విశ్వసనీయత వంటి ప్రయోజనాలను ఇకపై నిమిషాల్లోనే పొందవచ్చు,”ఆయన  అని తెలిపారు.

 ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 750కి పైగా మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ మరియు అర్బన్ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా ఈ ఆర్డర్లను నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులు వేగవంతమైన డెలివరీ సేవలను కొనసాగిస్తున్నారు. ఒక మిలియన్‌కు పైగా ఉత్పత్తులు అదే రోజున డెలివరీకి, నాలుగు మిలియన్లకు పైగా ఉత్పత్తులు మరుసటి రోజున డెలివరీకి అందుబాటులో ఉండగా, మరెన్నో మిలియన్ల ఉత్పత్తులపై ప్రైమ్  సభ్యులకు అపరిమిత, ఉచిత డెలివరీ సదుపాయం అందుబాటులో ఉంది.

అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్  సందర్భంగా అమెజాన్ నౌ లో వినియోగదారులు  స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, కిరాణా తదితర విస్తృత ఉత్పత్తులపై ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంటాయి.

SBI క్రెడిట్ & డెబిట్ కార్డులు, EMI లావాదేవీలపై వినియోగదారులకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్  సభ్యులు అదనంగా 10% వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

టేకి జయ రక్షితకు సివిల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా డా. ఎం. సృజన దేవి