ఏపీలో వాల్యూ గోల్డ్ సేవలు ప్రారంభం
ఏపీలో వాల్యూ గోల్డ్ సేవలు ప్రారంభం
-ప్రముఖ నటి అనసూయ చేతుల మీదుగా విశాఖలో
వాల్యు గోల్డ్ బ్రాంచ్ ల ఆవిష్కరణ
విశాఖపట్నం: -
ప్రముఖ బంగారు ఆభరణాల కొనుగోలు సంస్థ క్యాప్స్ గోల్డ్ యొక్క విభాగం అయిన వాల్యూ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఏడు కొత్త బ్రాంచ్ లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో వాల్యూ గోల్డ్ ఆవిష్కరణ ను ప్రముఖ నటి అనసూయ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారం కేవలం అలంకరణ మాత్రమే కాదని, మహిళలకు ఎంతో అనుబంధాన్ని కలిగి ఉంటున్నది అన్నారు. సరైన ధరకు అవసరార్థం బంగారాన్ని అమ్ముకునే అవకాశాన్ని వాల్యు గోల్డ్ కలిగించడం శుభపరిణామమన్నారు. వాల్యూ గోల్డ్ డైరెక్టర్ అభిషేక్ చందా మాట్లాడుతూ విశాఖపట్టణంలోని గాజువాక, జగదాంబ, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాల్లో, విజయవాడలోని ఎంజీ రోడ్డు, భవానీపురంలో, కర్నూల్ లోని ఇందిరా నగర్ లో తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
క్యాప్స్ గోల్డ్ నుంచి వారసత్వంగా పొందిన సమగ్రత, పారదర్శకతను అనుసరిస్తూ వాల్యూ గోల్డ్.. బంగారానికి తక్షణ నగదు, తాకట్టు బంగారం విడుదల మరియు ఖచ్చితమైన, సాంకేతిక ఆధారిత మూల్యాంకనాలతో వినియోగదారులకు మంచి వెసులుబాటు కల్పించనుందన్నారు.
వినియోగదారుడికే మొదటి ప్రాధన్యత ఇస్తూ, నమ్మకమైన ఆర్థిక లావాదేవీలు జరపాలనే లక్ష్యంతో 1901 నుంచి భారతదేశంలో అత్యంత పేరు పొందిన బంగారం కొనుగోలు సంస్థ క్యాప్స్ గోల్డ్ యొక్క విభాగమైన వాల్యూ గోల్డ్ అదే రీతిన సేవలందిస్తుందన్నారు. పారదర్శకత, ఖచ్చితత్వం మరియు ఆటోమేటెడ్ ప్రక్రియతో బంగారం కొనుగోలుకు సరికొత్త ఒరవడి చుట్టిందన్నారు. గత రెండు సంవత్సరాలలో, మేము తెలంగాణలో 10,000 మందికి పైగా వినియోగదారులకు సేవలు అందించామన్నారు.
గత రెండు సంవత్సరాలలో, వాల్యూ గోల్డ్ గణనీయమైన వృద్ధిని సాధించింది. నాలుగు బ్రాంచ్ లుగా మొదలై గత ఆరు నెలల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 15 కొత్త బ్రాంచ్ లను ప్రారంభించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19 బ్రాంచ్ లను కలిగి ఉందన్నారు. రాబోయే రెండు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 40 నుంచి 50 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించి దక్షిణ భారతదేశం అంతటా తన విశ్వసనీయ సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు.
వాల్యూ గోల్డ్ డైరెక్టర్ అఖిల్ చందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లోకి విస్తరించడం ద్వారా బంగారం విక్రయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చి, విశ్వసనీయంగా చేయాలనే లక్ష్యాన్ని బలపరుస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి వాల్యూ గోల్డ్ సీఈఓ భరద్వాజ్ పంపట్వార్, సౌమ్య చందా, ఆషికా చందా తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి