వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం
వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం విశాఖపట్నం 24 డిసెంబర్ 2025: స్థానిక మధురవాడ లోని లాభాపేక్షలేని ప్రముఖ ధార్మిక సంస్థ వేదాంత ఇనిస్టిట్యూట్. ఇది ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ ఎ.పార్థసారధి గారి సారధ్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వేదాంత అధ్యయనాలు, పరిశోధనలు మరియు వేదాంత అంశాలు ప్రచారానికి కృషి చేస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం జాతి, మత, వర్ణ వివక్ష లేకుండా అందరికి ఆధ్యాత్మిక అంశాలు పంచటం, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఆదర్శాలు పాటించే విధంగా యువతరాన్ని ప్రేరేపించటం, ఉత్తమ మార్గం వైపు వారిని నడిపించటం కోసం వేదాంత ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ వేదాంత చారిటబుల్ సంస్థ నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల కొరకు సిక్కు మతానికి చెందిన విశాఖపట్నం నివాసి శ్రీ సతీందర్ సింగ్ సేథీ ఈరోజు రూ.25,000/- విరాళం అందచేసారు.ఆయన విశాపట్నంలోని మూడు గురుద్వారాలలో సభ్యులుగా ఉన్నారు. పరోపకార పరాయణులు. సంస్థ నిర్వహించు రోజు వారీ సేవా కార్యక్రమాలకు ఈ విరాళం అందచేసినట్లు శ్రీ సతీందర్ సింగ్ సేథీ తెలిపారు. అంతేకాక వేదాంత సంస్థ భవిష్యత్తులో నిర్వహించు కార్యక్రమాలలో తాను కీలక పాత్రను పోషిస్తానని ఆయన చెప్పారు.ఈ సందర్భ...