సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

 సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

విశాఖ‌ప‌ట్నం, డిసెంబ‌ర్ 16:

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కామ‌ర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి, సింబ‌యాసిస్ టెక్నాల‌జీస్ సిఈఓ ఓరుగంటి న‌రేష్ కుమార్‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఆర్ట్స్ కామ‌ర్స్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.న‌ర‌సింహా రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌ర్క్‌ప్లేస్ డైన‌మిక్స్ అండ్ చాలెంజెస్ ఇన్ ద ఐ.టి సెక్టార్ పోస్ట్ పేండ‌మిక్‌- ఏ కేస్ స్ట‌డీ ఆన్ వ‌ర్క్ ఫ్రం-హోం ఇన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే అంశంపై జ‌రిపిన పరిశోధ‌న‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను న‌రేష్ కుమార్‌కు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విభాగ ఆచార్యులు, ప‌రిశోధ‌కులు, శ్రేయోభిలాషులు న‌రేష్ కుమార్‌ను అభినందించారు. అనంతరం నరేష్ కుమార్ ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు తన కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ప‌నిచేసే కార్యాలయ గతిశీలత మరియు కోవిడ్‌ మహమ్మారి అనంతర ఐటీ రంగంలో సవాళ్లు: ఆంధ్రప్రదేశ్‌లో వర్క్-ఫ్రమ్-హోమ్ పై ఒక అధ్యయనం అనే అంశంపై న‌రేష్ కుమార్ త‌న ప‌రిశోధ‌న జ‌రిపారు. కోవిడ్ అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐటి రంగంలో  ఎదురైన స‌వాళ్ల‌ను త‌న ప‌రిశోధ‌న‌లో అధ్య‌య‌నం చేశారు. సుదీర్ఘ కాలంగా సాఫ్ట్‌వేర్ సంస్థ‌ను నిర్వ‌హిస్తూ, ఐటి వ్య‌వ‌స్థ‌ను, అభివృద్ధిని, స‌వాళ్ల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్న న‌రేష్ కుమార్ ఆ రంగానికి ఎదురైన స‌వాళ్ల‌ను ప‌రిశోధ‌న అంశంగా తీసుకుని త‌న ప‌రిశోధ‌న సిద్దాంత గ్రంధాన్ని ఏయూకు స‌మ‌ర్పించి, డాక్ట‌రేట్ పొందారు.

ఋషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ , వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉపాధ్యక్షునిగా నరేష్ కుమార్ సేవలు అందిస్తున్నారు. నరేష్ కుమార్ గ‌తంలో బిఈ, ఎంబీఏ, ఎంఫిల్ డిగ్రీలను పూర్తి చేసి నేడు ఏయూ నుంచి పీ.హెచ్.డి అందుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న