వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం

 వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం


విశాఖపట్నం 24 డిసెంబర్ 2025: స్థానిక మధురవాడ లోని లాభాపేక్షలేని ప్రముఖ ధార్మిక సంస్థ వేదాంత ఇనిస్టిట్యూట్. ఇది ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ ఎ.పార్థసారధి గారి సారధ్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వేదాంత అధ్యయనాలు, పరిశోధనలు మరియు వేదాంత అంశాలు ప్రచారానికి కృషి చేస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం జాతి, మత, వర్ణ వివక్ష లేకుండా అందరికి ఆధ్యాత్మిక అంశాలు పంచటం, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఆదర్శాలు పాటించే విధంగా యువతరాన్ని ప్రేరేపించటం, ఉత్తమ మార్గం వైపు వారిని నడిపించటం కోసం వేదాంత  ప్రాధాన్యతను ఇస్తుంది.

ఈ వేదాంత చారిటబుల్ సంస్థ నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల కొరకు సిక్కు మతానికి చెందిన విశాఖపట్నం నివాసి శ్రీ సతీందర్ సింగ్ సేథీ ఈరోజు రూ.25,000/- విరాళం అందచేసారు.ఆయన విశాపట్నంలోని మూడు గురుద్వారాలలో సభ్యులుగా ఉన్నారు. పరోపకార పరాయణులు. సంస్థ నిర్వహించు రోజు వారీ సేవా కార్యక్రమాలకు ఈ విరాళం అందచేసినట్లు శ్రీ సతీందర్ సింగ్ సేథీ తెలిపారు. అంతేకాక వేదాంత సంస్థ భవిష్యత్తులో నిర్వహించు కార్యక్రమాలలో తాను కీలక పాత్రను పోషిస్తానని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా వేదాంత సంస్థ ట్రస్టీ మాట్లాడుతూ  సంస్థ కార్యక్రమాలకు సేవా దృక్పథంతో శ్రీ సతీందర్ సింగ్ సేథీ గారు భూరి విరాళం అందచేయటం చాల సంతోషం కలిగించినది. వారి సేవా తత్పరతకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము అన్నారు. భారతదేశపు పురాతన తత్వశాస్త్రం వేదాంతం. ఇది నవీన కాలమ్లో మనిషి ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను పరిష్కరించుటలోను  మరియు  ఉద్యోగం, ఇల్లు, ఆరోగ్యం,వివాహం వంటి అంశాలలో సంపూర్ణతను సాధించుటకు అవసరమైన తెలివి తేటలు విజ్ఞానం పొందుటకు సంస్థ వీలుకల్పిస్తుంది అన్నారు. నేడు సమాజంలో అనేక మంది మంచి విద్యాబుద్దులు ఉంది కూడ జీవిత సవాళ్ళను ఎదుర్కోలేక నిరాశ నిస్పృహ మరియు ఒత్తిడికి గురి అవుతున్నారు. వేదాంత ప్రచార కార్యక్రమాలు  అలాటి వారిలో చైతన్య కలిగించి వారికి వెలుగు మార్గం చూపుతుంది. 

వేదాంత సంస్థ నిర్వాహకులు  శ్రీ స్వామి పార్థసారధి గారి శిష్యురాలు సుశీలాజీ గారిచే వేదాంత సంస్థ వార్షిక భగవద్గీత 11వ అధ్యాయం ప్రసంగాలను 28 జనవరి 2026 నుంచి 1 ఫిబ్రవరి 2026 వరకు అయిదు రోజులు పాటు స్థానిక సిరిపురం లోని VMRDA చిల్డ్రన్స్ అరీనాలో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియచేసారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న