టేకి యశ్వంత్ కుమార్‌కు ఏయూ డాక్టరేట్
టేకి యశ్వంత్ కుమార్‌కు ఏయూ డాక్టరేట్
ఆంధ్రవిశ్వవిద్యాలయం, డిసెంబర్ 9:
ఆంధ్రవిశ్వవిద్యాలయం కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి టేకి యశ్వంత్ కుమార్‌కు డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఎన్.కిషోర్ బాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐదు నగరాలలో వినియోగదారుల వైఖరులు, వినియోగిస్తున్న వస్తువులను మార్పు చేయడం, సేల్స్ ప్రమోషన్స్, బ్రాండ్ లాయల్టీపై ప్రభావం చూపే అంశాలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో డాక్టరేట్ ఉత్తర్వులు అందజేసి అభినందించారు.
తన పరిశోధనలో భాగంగా యశ్వంత్ కుమార్ వాణిజ్య రంగానికి ఉపయుక్తంగా నిలచే డిజిటల్ టు ఫిజికల్ కస్టమర్ ట్రాన్సిషన్ (డిపిసిటి) మోడల్‌ను అభివృద్ధి చేసారు. ఈ మోడల్‌ను ఉపయోగించి ఒక నిర్ధిష్ట ప్రాంతంలో నూతనంగా ఒక స్టోర్‌ను ఏర్పాటు చేయడానికి, సేల్స్ జరగడానికి అవకాశం ఉన్నదీ, లేనిదీ ముందుగానే తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. నూతనంగా వ్యాపర సంస్థలను నెలకొల్పాలని భావించే వారికి అక్కడ వినియోగదారుల వైఖరులు, కొనుగోలు విధానంపై సమగ్ర అధ్యయనం చేసి ఒక స్పష్టమైన ఫలితాన్ని అందించి వ్యాపార వృద్ధకి అవకాశాలను సూచిస్తుంది.
ప్రస్తుతం టేకి యశ్వంత్ కుమార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్) గా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి యశ్వంత్ కుమార్ పిహెచ్‌డిలో చేరారు. అదే విధంగా ఫండమెంటల్స్ ఆఫ్ రిటైల్ మేనేజ్‌మెంట్ అంశంపై రెండు పుస్తకాలను సైతం రచించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి