కుంగ్ ఫు లో బ్లాక్ బెల్ట్ అందుకున్న డా. ఆడారి కిషోర్ కుమార్

 బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ 

కుంగ్ ఫు లో బ్లాక్ బెల్ట్ అందుకున్న

 డా. ఆడారి కిషోర్ కుమార్  

 బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం నాడు శివాజీ పార్కులో  బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 150 మంది విశాఖ శ్రీకాకుళ విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథి గా లెఫ్టినెంట్ కల్నల్ శ్రీ నీరజ్ కుమార్ గారు విచ్చేసి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ను గొప్ప శక్తి వంతులుగా తీర్చిదిద్దుతుంది అని పేర్కొన్నారు, గౌరవ అతిథి గా విశాఖ ఈస్ట్ డివిజన్ ACP శ్రీ లక్ష్మణ మూర్తి గారు విచ్చేసి చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆత్మరక్షణ,క్రమశిక్షణ మంచిగా అలవర్చుకోగలరని పేర్కొన్నారు. BYKK వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ శ్రీ దయామయ గారు గౌరవ అతిథి గా విచ్చేసి మార్షల్ ఆర్ట్స్ అనేవి విద్యార్థి కి గొప్ప వరం అని దీని ద్వారా క్రమశిక్షణ,ఆత్మ స్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు, కర్షక దేవోభవ సంస్థ జాతీయ అధ్యక్షులు  డా. ఆడారి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు తప్పక నేర్చుకోవాల్సిన విద్య మార్షల్ ఆర్ట్స్ అని అది బాల్యాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ అంతటిని BYKK విశాఖ గురు మాస్టర్ వెంకట్ ఘనంగా నడిపించారు.. కార్యక్రమ అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులుకు ఆయా బెల్ట్ లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు.


బ్లాక్ బెల్ట్ పొందిన యోధులు

డా. ఆడారి కిషోర్ కుమార్ 

O. వంశీ కృష్ణ

A. లికిల్ కైలాస్ రాజ్

L. దుర్గా ప్రసాద్ 

B. చరిత్ కుమార్ అలెగ్జాండర్ 

M. గౌతమి 


బ్రౌన్ బెల్ట్ పొందిన యోధులు 

G. స్నేహ విజయ

Ch.అమృత

A. వేదాంజలి 

P.క్రితిక్ శ్రీ తేజ్

p.క్రితివాస్ 


గ్రీన్ బెల్ట్ పొందిన యోధులు 

B. కోటేశ్వరరావు 

A. జగదీశ్ 

B. రాఘవ 

M. యువరాజు 

B. శివ 

K. సాత్విక 

K. కాస్వి



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న