ఘనంగా ముగిసిన నర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర సదస్సు
ప్రతిభతో మైమరపించిన యువత - టాలెంట్‌తో మెప్పించిన నర్సింగ్ విద్యార్థులు – ఘనంగా ముగిసిన నర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర సదస్సు విశాఖపట్నం, సెప్టెంబర్ 24: ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా 31 వ ఎస్ ఎన్ ఏ ఐ ద్వై వార్షిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సు 2025 ఘనంగా ముగిసింది. ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఈ కార్యక్రమాన్ని లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్ అనే అంశంపై సదస్సును నిర్వహించింది. ముందుగా ఫ్లోరెన్స్ నైటేంగిల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన దాదాపు మూడువేల మంది విద్యార్థులు ఉత్సాహంగా రెండు రోజుల రాష్ట్ర సదస్సులో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ సి.ఆర్ షంషీర్ బేగం మాట్లాడుతూ విశాఖ వేదికగా నిర్వహించిన రెండు రోజుల సదస్సు విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల భాగస్వామ్యం, వారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయ...