ఘ‌నంగా ముగిసిన‌ నర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర సదస్సు

 ప్ర‌తిభ‌తో మైమ‌ర‌పించిన యువ‌త‌
- టాలెంట్‌తో మెప్పించిన న‌ర్సింగ్ విద్యార్థులు
– ఘ‌నంగా ముగిసిన‌ నర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర సదస్సు

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: 

 ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా 31 వ ఎస్ ఎన్ ఏ ఐ ద్వై వార్షిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సు 2025 ఘ‌నంగా ముగిసింది. ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఈ కార్యక్రమాన్ని లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ఏ నర్సింగ్ స్టూడెంట్ అనే అంశంపై స‌ద‌స్సును నిర్వ‌హించింది. ముందుగా ఫ్లోరెన్స్ నైటేంగిల్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు.  రెండు రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి  హాజ‌రైన దాదాపు మూడువేల మంది విద్యార్థులు ఉత్సాహంగా రెండు రోజుల రాష్ట్ర స‌ద‌స్సులో ఉత్సాహంగా భాగ‌స్వాముల‌య్యారు. 

టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ సి.ఆర్ షంషీర్ బేగం మాట్లాడుతూ విశాఖ వేదికగా నిర్వహించిన రెండు రోజుల సదస్సు విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విద్యార్థుల భాగ‌స్వామ్యం, వారి స‌మ‌న్వ‌యంతో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన విధానం ఎంతో అభినంద‌నీయ‌మ‌న్నారు. స‌ద‌స్సును  సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను ప్ర‌ద‌ర్శించిన తీరును అభిల‌ష నీయ‌మ‌న్నారు.

టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కార్యదర్శి ఏపీ ఎన్.ఎం.సి రిజిస్ట్రార్‌ ఆచార్య కె. సుశీల మాట్లాడుతూ నిత్యం పుస్త‌కాల‌తో మ‌మేక‌మై ఉండే విద్యార్థులు  క్రీడ‌లు, సాంస్కృతిక‌, మేధో పోటీల‌లో పాల్గొని త‌మ ప్ర‌తిభ‌ను చాటార‌న్నారు. పోటీల‌లో పాల్గొన‌డం, ప్ర‌తిభ చూప‌డం వారిలో సామ‌ర్ధ్యాల‌ను వెలుగులోకి తెచ్చాయ‌న్నారు. భ‌విష్య‌త్ త‌రం నాయ‌క‌త్వానికి ప్ర‌తిరూపాలుగా నిలుస్తున్నార‌న్నారు.

టి.ఎన్.ఎ.ఐ ఆంధ్ర ప్రదేశ్ ఎస్.ఎన్.ఎ సలహాదారు డాక్టర్ ఎం.సత్య వల్లి అసోసియేషన్ త‌ర‌పున భాగ‌స్వాములైన క‌ళాశాల‌ల యాజ‌మాన్యాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రంగోలి, పేపర్ ప్రజెంటేషన్, క్రీడలు, సాంస్కృతి అంశాలలో వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. విజేత‌ల‌కు  బహుమతులను ప్రధానం చేసారు.కార్య‌క్ర‌మంలోస‌మావేశంలో ఎగ్జిక్యూటివ్ స‌భ్యులు కె.ఝాన్సీ ల‌క్ష్మీభాయి, డి.ఉష ప‌న్న‌గ వేణి, డాక్టర్ టి. అన్నమ్మ, కె.పద్మావతి, ఆచార్య బి.అనంత‌మ్మ‌, కె.వి శ్రీ దేవి, జె.లీల, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్ పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్ పర్సన్ చంద్రశేఖర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న