నేటి నుంచి న‌ర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర‌ స‌ద‌స్సు ప్రారంభం

 నేటి నుంచి న‌ర్సింగ్ విద్యార్థుల రాష్ట్ర‌ స‌ద‌స్సు ప్రారంభం 
- ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా రెండు రోజుల కార్య‌క్ర‌మాలు
- న‌ర్సింగ్ విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యం


విశాఖపట్నం సెప్టెంబర్ 22: 

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా ది ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టి.ఎన్‌.ఏ.ఐ) ఆంధ్ర‌ప్రదేశ్ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో 24, 25 తేదీల్లో రెండు రోజుల‌పాటు న‌ర్సింగ్ విద్యార్థుల ద్వైవార్షిక రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్- 2025ను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌, టి.ఎన్‌.ఏ.ఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప్రొఫెసర్ కె. సుశీల తెలిపారు. సోమవారం సాయంత్రం రామ్ నగర్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ వివరాలను ఆమె వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా రెండు రోజులపాటు  లెర్నింగ్ టుడే, లీడింగ్ టుమారో జ‌ర్నీ ఆఫ్ న‌ర్సింగ్ స్టూడెంట్స్ అనే అంశంపై స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థుల‌లో సామ‌ర్ధ్యాల‌ను వెలికితీసి, వారిలో నాయ‌క‌త్వాన్ని ప్రోత్సంహించే విధంగా రెండు రోజుల కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌న్నారు. న‌ర్సింగ్ విద్యార్థుల జీవితాలో ఒక మ‌ర‌పురాని సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మం నిల‌చిపోతుంద‌న్నారు. స‌ద‌స్సును ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి డాక్ట‌ర్ పి.చంద్ర‌శేఖ‌ర్ హాజ‌ర‌వుతార‌న్నారు. 

టి.ఎన్‌.ఏ.ఐ రాష్ట్ర అద్య‌క్షురాలు డాక్ట‌ర్ సి.ఆర్ శంషీర్ బేగం మాట్లాడుతూ వేలాది మంది న‌ర్సింగ్ విద్యార్థులు రంగోలి, పోస్ట‌ర్ ప్ర‌జంటేష‌న్‌, సైంటిఫిక్ పేప‌ర్ ప్ర‌జంటేష‌న్‌, పెయింటింగ్‌, మోనో ఏక్టింగ్‌, వ్యాస ర‌చ‌న‌, నృత్య పోటీల‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. న‌ర్సింగ్, వైద్య రంగంలోఉన్న నిపుణులు విచ్చేసి ప్ర‌త్యేక ప్ర‌సంగాలు ఇస్తార‌న్న‌రారు. విద్యార్థుల‌కు నైపుణ్యాల‌ను పెంపొందించ‌డం, నాయ‌కులుగా ఎద‌గ‌డంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామ‌న్నారు. రాష్ట్ర స్థాయి పోటీల‌లో విజేత‌లుగా నిల‌చిన వారిని జాతీయ‌స్థాయి పోటీల‌కు పంప‌డం జ‌రుగుతుంద‌న్నారు.

విలేక‌రుల స‌మావేశంలో ఎగ్జిక్యూటివ్ స‌భ్యులు కె.ఝాన్సీ ల‌క్ష్మీభాయి, డి.ఉష ప‌న్న‌గ వేణి,ఆచార్య బి.అనంత‌మ్మ‌, కె.వి శ్రీ దేవి, కె.ప‌ద్మావ‌తి, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్ పర్సన్ ప్రీతం లూక్స్, కో చైర్ పర్సన్ చంద్రశేఖర్ త‌దిత‌రులు పాల్గొన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న