సివిల్ ఇంజనీరింగ్ లో లావణ్య రేఖకు డాక్టరేట్

 సివిల్ ఇంజనీరింగ్ లో లావణ్య రేఖకు డాక్టరేట్


ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధన విద్యార్థిని  పైలా లావణ్య రేఖకు డాక్టరేట్ లభించింది.  సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య సి.ఎన్.వి. సత్యనారాయణ రెడ్డి  మార్గదర్శకత్వంలో రహదారుల నిర్మాణంలో నేలపై భాగంలో ఉండే మట్టి (సబ్గ్రేడ్ సాయిల్ స్ట్రెంత్) నాణ్యత, పటిష్టతను గుర్తించడానికి సులభమైన విధానాలను రూపొందించినందుకు డాక్టరేట్ లభించింది.ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను పరిశోధక విద్యార్థిని లావణ్య రేఖ అందుకున్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, డీన్ అకాడమిక్స్ ఆచార్య కె. శ్రీనివాస రావు, డిపార్ట్మెంట్ హెడ్ ఆచార్య సి.ఎన్.వి. సత్యనారాయణ రెడ్డి, సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధ్యాపకులు, పరిశోధకులు  అభినందించారు.

"Development of Correlation Equations between California Bearing Ratio (CBR) and Dynamic Cone Penetration Index (DCPI) for Clayey silty sand/ Silty sand and Clays of Low and Intermediate Compressibility” అనే అంశం పై లావణ్య రేఖ సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్ లభించింది. ఈ పరిశోధన సివిల్ ఇంజినీర్లకు ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ డిజైన్లో ముఖ్యమైన పారామీటర్ అయిన CBR (California Bearing Ratio) విలువలను త్వరగా అంచనా వేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా CBR పరీక్ష చేయడానికి నాలుగు రోజులు పడుతుంది, కానీ ఈ అధ్యయనంలో అభివృద్ధి చేసిన కోరిలేషన్ ఈక్వేషన్ల ద్వారా కేవలం 15 నిమిషాల్లో DCPI (Dynamic Cone Penetration Index) నుండి CBR విలువను అంచనా వేసే అవకాశం ఉంది. సి.బి.ఆర్ మరియు డైనమిక్ కోన్ పెనిట్రేషన్ ఇండెక్స్ మధ్య అభివృద్ధి చేసిన కోరిలేషన్స్ కొత్త రహదారుల వెంట ఉన్న ప్రస్తుత సబ్ గ్రేడ్ సాయిల్ మరియు కాంపాక్టెడ్ సాయిల్ సబ్ గ్రేడ్ యొక్క సి.బి.ఆర్ విలువలను అతి వేగంగా అంచనా వేయడంలో హైవే ఇంజినీర్లకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పరిశోధనకు గాను రెండు ఇండియన్ పేటెంట్స్ ప్రచురితమయ్యాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న