'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకావిష్కరణ
'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకావిష్కరణ
విశాఖపట్నం 26 మార్చి 2026 : సాహిత్య సంస్కృతులకు నెలవైన విశాఖపట్నం నగరం ఈరోజు మరోసారి తన సాహిత్య సౌరభాలను వెదజల్లినది. రచయిత మరియు వెల్‌బీయింగ్ & హ్యాపీనెస్ కోచ్ అయిన ఎల్ ఎన్ హోలానీ రచించిన 'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకావిష్కరణ ఈరోజు నిర్వహించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాంబ దాస్ ప్రభుజీ, విశాఖపట్నం ఇస్కాన్ అధ్యక్షులు, గౌరవ అతిథిగా డా ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, విశాఖ వ్యాలీ పాఠశాల, ప్రత్యేక అతిధులుగా శ్రీ నిరంజన్ కుమార్ సోమాని, అధ్యక్షులు, రాజస్థానీ సాంస్కృతిక మండలి మరియు శ్రీ జయదీప్ బిస్వాస్, జనరల్ మేనేజర్, ది పార్క్ హోటల్, విశాఖపట్నం తదితర పురప్రముఖుల సమక్షంలో పుస్తక ఆవిష్కరణ చేసారు.
వ్యక్తులు ఆనందం సంతోషం అనేవి మరోచోటికి వెళితేనే దొరుకుతాయి అని ఆనందాన్ని అన్వేషిస్తూ వెళుతుంటారు. కానీ నిజమైన ఆనందం మనలోనే దాగి ఉందనే సత్యాన్ని ఈ 'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం చదివిన పాఠకులు తనని తానూ ఆత్మ పరిశీలన చేసుకునే లాగా, ఆలోచనాత్మకతను రేకెత్తిస్తుంది. అన్ని వయసుల వారికి అనువుగా ఈ పుస్తక రచన చేయటం జరిగినదని, ఏదో పుస్తకం చదివేద్దాం అని కాకుండా పుస్తకాన్ని తీరికగా అర్థవంతంగా చదివి ఆకళింపు చేసుకోవాలని, ఇందులోని సందేశాన్ని అవగాహన చేసుకుని ఆనందానుభుతిని పొందవలసినదిగా పుష్క రచయిత విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆధునిక జీవనసరళిని దృష్టిలో ఉంచుకుని రచించిన ఈ పుస్తక రచనకు తనను ప్రోత్సహించిన ప్రముఖులకు, కుటుంబసభ్యులకు మరియు స్నేహితులకు రచయిత ఎల్ ఎన్ హోలానీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియచేసారు. వ్యక్తులు తమలోని అంతర్గత ఆలోచనలను, కుటుంబాలు, సమాజంలోను ఆనందాన్ని ఏ విధంగా పొందవచ్చునో ఈ పుస్తకం వివరిస్తుందని ఆయన అన్నారు. ఈ పుస్తక రచన ద్వారా, ప్రజలు తమలోని అంతర్గత సామర్థ్య అన్వేషణ మరియు అవగాహన పొంది ఆనందమయ జీవితాన్ని పెంపొందుటకు స్ఫూర్తిదాయకం కావాలని రచయిత ఆశిస్తున్నారు. ఈ పుస్తకం భారతదేశం అంతటా మరియు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన అన్ లైను వేదికల ద్వారా పాఠకులకు లభిస్తుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి