అమెరికా వీసా నిబంధనలలో మార్పులు
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు
- విద్యార్థి వీసాలలో 50 శాతం కోత
- ప్రత్యామ్నాయంగా ఈబీ-5 మార్గం
విశాఖపట్నం, ఫిబ్రవరి 10, 2026:
అమెరికా వీసా నిబంధనలలో పెను మార్పులు సంభవించాయని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బీచ్‌రోడ్డులో ఉన్న ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసే ఎఫ్-1 వీసాల్లో 50 శాతం తగ్గుదల నమోదైందన్నారు. హెచ్-1బీ వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డ్ కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘ కాలం దృష్ట్యా, భారతీయులకు 'ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్' ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక చర్చల్లో ఇమ్మిగ్రేషన్ ప్రధానాంశంగా ఉందన్నారు. దీనివల్ల భారత్ గణనీయంగా ప్రభావితమవుతోందన్నారు. విద్యార్థి, పని వీసాల నుంచి గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ల వరకు భారతీయ దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన తనిఖీలను, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అర్థం చేసుకోవడం ఎంతో కీలకమన్నారు. విద్యార్థి వీసాల తగ్గుదల, హెచ్-1బీ నిబంధనల్లో మార్పులు, కఠినమైన కాన్సులర్ తనిఖీల కారణంగా ఈ ఏడాది ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు 50 శాతం తగ్గాయన్నారు. విద్యార్థులు కేవలం గుర్తింపు పొందిన విద్యా సంస్థలకే దరఖాస్తు చేసుకోవాలని, రికార్డులు ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, చిన్నపాటి దొంగతనాలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి చిన్న పొరపాట్లు కూడా ఇప్పుడు వీసా నిరాకరణకు దారితీస్తాయని హెచ్చరించారు.
హెచ్-1బీ వీసాల్లో కీలక మార్పులు వచ్చాయన్నారు. అమెరికా వెలుపల ఉన్న కాన్సులేట్‌లలో వీసా పొందేందుకు ఎంప్లాయర్స్ లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో ఉండి స్టేటస్ మార్చుకునే వారికి ఇది వర్తించదన్నారు. ఉన్నత విద్య, ఎక్కువ వేతనం ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చేలా వెయిటెడ్ లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతం భారతీయులకే లభిస్తున్నప్పటికీ, గ్రీన్ కార్డ్ కోసం 10 నుంచి 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నిపుణులను అనిశ్చితిలో పడేస్తోందని పేర్కొన్నారు. ఎటువంటి కోటాలు లేని ఎల్-1 ఇంట్రా-కంపెనీ ట్రాన్స్‌ఫర్ వీసాలు స్థిరమైన మార్గాలని సూచించారు. ముఖ్యంగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించాలనుకునే టెక్స్‌టైల్ ఎగుమతిదారులకు ఇది గొప్ప అవకాశమన్నారు. ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ శాశ్వత నివాసానికి సులభతరమైన మార్గమబ్నారు. శాశ్వత నివాసం పొందాలనుకునే వారికి ఇది అత్యంత ఆచరణాత్మకమైన మార్గమన్నారు. టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియాల్లో (టీఈఏ) ఉన్న రీజినల్ సెంటర్లలో 800,000 డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో ఉద్యోగ కల్పన బాధ్యతను యూఎస్సీఐఎస్ గుర్తింపు పొందిన సెంటర్లే చూసుకుంటాయన్నారు. 30 ఏళ్ల అనుభవంతో వేల సంఖ్యలో ఈబీ-5 కేసులను ఫైల్ చేశానన్నారు. నా దగ్గర దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ గ్రీన్ కార్డ్ వచ్చిందన్నారు. 4-6 ఏళ్లలో వారి పెట్టుబడి తిరిగి లభించిందన్నారు. ఒక్క కేసు కూడా తిరస్కరణకు గురి కాలేదన్నారు. అమెరికాలో ఉన్న ఈబీ-5 దరఖాస్తుదారులు ఐదు నెలల్లోనే పని చేయడానికి అనుమతి పొందవచ్చని, కాన్సులేట్ సందర్శనల అవసరం ఉండదని పేర్కొన్నారు. పెట్టుబడి భద్రత తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు.
.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి