ఏయూలో మెస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి
ఏయూలో మెస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి
- హాస్టల్ మెస్‌లు మూసివేయలేదు
-అసత్య ప్రచారాలను నమ్మవద్దు
ఆంధ్రవిశ్వవిద్యాలయం, జనవరి 21:
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థుల మెస్‌లు అన్నీ పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మెస్‌లు మూసివేసారని, మెస్‌లకు తాళాలు వేసారని వస్తున్న వార్తలు, కథనాలు అవాస్తవమన్నారు. సెలవులు అనంతరం హాస్టల్స్, మెస్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకువచ్చామన్నారు. విద్యార్థులకు మెస్‌లలో భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కొంత మంది ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని, వీటిని నమ్మవద్దన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెస్‌లలో ఉదయం టిఫిన్, మద్యాహ్నం, రాత్రి భోజనం అందించడం జరుగుతోందన్నారు.
విశ్వవిద్యాలయంలో సెలవులు ముగిసిన వెంటనే ఇంకా విద్యార్థుల పూర్థిస్థాయిలో వర్సిటీకి చేరుకోలేదని తెలిపారు. దీని కారణంగా విద్యార్థులకు కామన్ మెస్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సైన్స్, ఆర్ట్స్ కళాశాలల పరిధిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కామన్ మెస్ మెదటి రెండు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో హాస్టల్ మెస్‌లో కేవలం 40-50 మంది విద్యార్థులు మాత్రమే రావడం జరిగిందని, దీనితో రెండు మూడు మెస్‌లను కలిపి కామన్ మెస్‌గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దశాబ్ధాలుగా విశ్వవిద్యాలయంలో ఈ విధానం అమలులో ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన వెంటనే యథాతథంగా పూర్తిస్థాయిలో అన్ని మెస్‌లు తెరుచుకోవడం, వారికి సంబంధిత మెస్‌లలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అదే విధంగా విద్యార్థులు మెస్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులకు తెలియ జేయడం జరుగుతుందన్నారు. ఇది ప్రతీ సంవత్సరం జరిగే ప్రక్రియగా నిలుస్తుందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుడా, ప్రజలను, విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ ఫీజులు చెల్లిస్తేనే భోజనం పెడతామంటూ కొందరు అసత్య ప్రచారం చేసారని ఇది సత్యదూరమన్నారు. విద్యార్థులందరికీ మెస్‌లలో పూర్తిస్థాయిలో భోజనాలు ఏర్పాటు చేసామన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏయూ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారన్నారు.
మహారాణిపేటలోని మహిళా హాస్టల్‌లో 19వ తేదీ ఉదయం టిఫిన్ 310, మద్యాహ్నం భోజనం 550, రాత్రి భోజనం 600 మంది, 20వ తేదీ ఉదయం టిఫిన్ 600, మద్యాహ్న భోజనం 600, రాత్రి భోజనం 700 మందికి అందించారు.
సైన్స్ కళాశాల పరిధిలో 19వ తేదీన విద్యార్థులు ఎవ్వరూ మెస్ కార్డులు ఓపెన్ చేయలేదు. 20వ తేదీన మద్యాహ్నం 70, రాత్రి 140 మంది, 21వ తేదీ ఉదయం టిఫిన్ 220, మద్యాహ్నం భోజనం 240 మంది చేసారు.
ఆర్ట్స్ కళాశాల పరిధిలో 19,20 తేదీలలో విద్యార్థులు మెస్ కార్డులను ఓపెన్ చేయలేదు. 21వ తేదీ ఉదయం టిఫిన్‌కి 155, మద్యాహ్నం భోజనం 240మంది చేసారు. న్యాయ కళాశాల హాస్టల్‌లో 31 మంది మద్యాహ్నం భోజనం చేసారు.
విద్యతరంగిణి హాస్టల్‌లో సోమవారం నుంచి వచ్చిన ప్రతీ విద్యార్థినికి టిఫిన్, భోజనం అందించడం జరుగుతోంది.
విశ్వవిద్యాలయంలో హాస్టల్స్‌లో పూర్తిస్థాయిలో ప్రతీ విద్యార్థికి భోజనం అందించే విధంగా సిబ్బంది పనిచేస్తున్నారు. విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు, మెస్‌లకు తాళాలు వేసారు అని జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి