ఏయూలో ముగిసిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
ఏయూలో ముగిసిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
ఆంధ్రవిశ్వవిద్యాలయం :
ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో-ఇంజనీరింగ్ విభాగంకి చెందిన ఉర్వికృతి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవం 2025 ముగింపు వేడుకలు ఈరోజు వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై వివిధ కార్యక్రమాలలో పాల్గొని, విజేతలుగా నిలచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఐడియాథాన్ కార్యక్రమంలో విజేతలుగా నిలచినవారికి బహుమతులు అందించారు. సమిష్టిగా పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల వలన నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పారు.
జియో-ఇంజనీరింగ్ విభాగం అధిపతి ఆచార్య పి. జగదీశ్వర రావు గత కొన్ని రోజులుగా నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థుల సమిష్టి కృషిని అభినందించారు. అనంతరం విభాగాధిపతి ఆచార్య జగదీశ్వర రావును సత్కరించారు. కారయక్రమంలో ఆచార్య మురళీకృష్ణ, ఆచార్య విక్టర్ బాబు, విద్యార్థులు కె.ఎల్.ఎస్.పి వర్షిణి, పి.సంజన, డి.ఎస్.ఎస్ చంద్రవర్ధన్,ఏ.సుస్మిత తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి