అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 కి విశేష ఆదరణ

 అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 కి విశేష ఆదరణ 
 -విశాఖలో అమేజాన్ గణనీయమైన  వృద్ధి 

విశాఖపట్టణం- 

సెప్టెంబర్ 22న  ప్రారంభమైన ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో   ఆంధ్రప్రదేశ్ లోని వినియోగదారులు మరియు సెల్లర్స్ ఉత్సాహవంతంగా పాల్గొన్నారని, ఆంధ్రప్రదేశ్ లో విశేష ఆదరణ లభించిందని అమెజాన్ బజార్ ప్రోడక్ట్ బిజినెస్ హెడ్ సమీర్ లాల్వాని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, నిత్యావసరాలలో శక్తివంతమైన వృద్ధి కనిపించిందన్నారు.  అమేజాన్ ఇండియాకు  ఆంధ్రప్రదేశ్ నుండి శ్రేణుల్లో విక్రయించే సెల్లర్స్ 23,000 మందికి పైగా ఉన్నారు మరియు మరియు రాష్ట్రంలో అన్ని పిన్ కోడ్స్ కు వేగంగా మరియు సౌకర్యవంతంగా అందచేయడానికి 105కి పైగా డెలివరీ స్టేషన్స్ అమేజాన్ కి ఉన్నాయన్నారు.

అక్టోబర్ 6 నుండి కస్టమర్లు అమెజాన్ డాట్ ఇన్ లో “దీపావళి ప్రత్యేకం“తో డీల్స్ మరియు ఆఫర్లను పొందవచ్చు అని,  స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ కిచెన్ & అవుట్ డోర్స్  పై 80 శాతం వరకు  తగ్గింపు పొందవచ్చు అని చెప్పారు.  నిత్యావసరాలపై 70 శాతం  వరకు తగ్గింపు పొందవచ్చు అని, టీ వీ లు మరియు గృహోపకరణాలపై 50 శాతం  వరకు తగ్గింపును పొందవచ్చు అని, అమేజాన్ ఫ్రెష్, అలెక్సాతో ఇకో, ఫైర్ టీ వీ & కిండిల్ మరియు ఇంకా ఎన్నో వాటిపై  50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కస్టమర్లు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025ను ఇంతకు ముందు కంటే పెద్దగా సంబరం చేస్తున్నారన్నారు. ప్రీమియం టీవీ లు మరియు విలువైన జ్యువలరీ నుండి నిత్యావసరాలు మరియు అత్యంత సరసమైన ఉత్పత్తుల్ని అమేజాన్ బజార్ నుండి కొనుగోలు చేస్తున్నారన్నారు.  జీ ఎస్ టీ ఆదాలు, బ్యాంక్ ఆఫర్లు మరియు అమేజాన్ పే రివార్డ్స్ తో పండగ షాపింగ్ ఇంతకు ముందు కంటే ఎక్కువగా మరింత సరసమైనదిగా, సౌకర్యవంతమైనదిగా మరియు బహుమానపూర్వకమైనదిగా చేస్తున్నామన్నారు. 

 ఈ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఆర్డర్లు వార్షికంగా 26 రెట్లు వృద్ధి చెందాయి మరియు కొత్త కస్టమర్లు వార్షికంగా 4.2 రెట్లు పెరగడం ద్వారా  అమేజాన్ బజార్ అమోఘమైన వేగాన్ని చూసిందన్నారు. గొప్ప ప్రదర్శన చూపించిన విశాఖపట్టణం, పండగ సమయంలో 2.2  శాతం రెట్లు సహా  వార్షికంగా 22 రెట్ల కంటే అధికంగా  వృద్ధిని నమోదు చేసిందని, 2024లో ప్రారంభించబడిన అమేజాన్ బజార్ భారతదేశపు అత్యంత సరసమైన ఆన్ లైన్ షాపింగ్ గమ్యస్థానాల్లో ఒకటిగా వేగంగా మారింది, రూ. 600 లోపు 2 కోట్లకు పైగా ఉత్పత్తులను అందిస్తోందన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న