విద్య విభాగం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
దేశమే ముఖ్యం అనే నినాదంతో యువత ముందుకు సాగాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణ
దేశ అభ్యున్నతి, వికాసం ప్రధాన లక్ష్యంగా యువత ముందుకు సాగాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు అన్నారు. విద్యావిభాగమా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ఏయూ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య షారోన్ రాజు మాట్లాడుతూ భారత దేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి దేశ సమగ్రతకు కృషి చేస్తూ, అభివృద్ధికి చోదక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. యువతరం తమ జ్ఞానాన్ని, మేధస్సును నూతన ఆవిష్కరణలు చేసే దిశగా వినియోగించాలని తద్వారా సాంకేతికంగా భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు యువత విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
భారతదేశ స్వాతంత్ర సముపార్జన లో ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారు అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లడం ఎంతో అవసరమని అన్నారు మన్యం వీరుడు గా స్వాతంత్ర పోరాటయోధుని గా ఎందరికో స్ఫూర్తి ని నింపిన అల్లూరి సీతారామరాజు ను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆదివాసీల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు అల్లూరు చేసిన సేవలు, పోరాటం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో దేశం బలోపేతం కావాలని, దీనికి యువత కీలకంగా నిలుస్తారని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి దేశీయంగా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యువతరం పారిశ్రామికవేత్తలుగా ఎదగడం ద్వారా నూతన అవకాశాలను సృష్టించాలని కోరారు.
ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాలను పట్టుకుని విద్యార్థులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఆలీ, డాక్టర్ మూర్తి, డాక్టర్ ప్రవీణా దేవి, డాక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి