లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్ కు విరాళం
లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్ నందు డెర్మటాలజీ విభాగాన్ని స్థాపించడానికి మరియు మల్టీ యుటిలిటీ ఫోటోథెరపీ యూనిట్ 12NBUVB (311nm) ఫిలిప్స్ హాలండ్ కొనుగోలు కోసం లయన్ కొండపనేని అజయ్ కుమార్ గారు, వారి ధర్మపత్ని మరియు చురుకైన సామాజిక కార్యకర్త అయిన కీర్తిశేషులు శ్రీమతి కె.శ్యామలా కుమారి గారి జ్ఞాపకార్థం, రూ.1,05,000/- (రూపాయలు ఒక లక్ష ఐదు వేలు మాత్రమే), ఉదారంగా విరాళం ఇచ్చారు. ఈ రోజు వారు హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు గారికి చెక్ అందించారు. మన కమ్యూనిటీలోని చర్మవ్యాధి రోగులకు సహాయం చేయడంలో ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది. ఒక గొప్ప కారణం కోసం సహాయం చేసిన లయన్ కొండపనేని అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్ సభ్యులు ఎస్. వి.వి. ఎస్. మూర్తి గారి సహకారానికి ధన్యవాదాలు.
లయన్.డాక్టర్.వి.ఉమా మహేశ్వరరావు
మేనేజింగ్ ట్రస్టీ
లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్, విశాఖపట్నం

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి