యువత ఏఐ రంగంలో నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి

 భవిష్యత్తు అంతా ఏఐ ఆధారితంగానే పనిచేస్తుంది 

– యువత ఈ రంగంలో నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి 
– యువత మేధస్సుకు మంచి అవకాశం

భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడుస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భాగం సంయుక్తంగా బుధవారం నిర్వహించిన బిల్డ్ భారత్ హాక్ థాన్ ను ప్రారంభించారు. యువత మేధస్సుకు పదును పెట్టే విధంగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సృజనాత్మకంగా పనిచేస్తూ నూతన ఆవిష్కరణలు జరపాలని సూచించారు. ఇటువంటి హ్యాక థాన్ లో భాగస్వామ్యం కావడం వలన యువతలో కోడింగ్ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని అన్నారు. యువత ఇక్కడ నుంచి స్ఫూర్తిని పొంది నూతన అంకుర సంస్థలను స్థాపించే విధంగా అడుగులు వేయాలని తెలిపారు.

 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య కె.వెంకట రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల నుంచి, 488 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. యువతను ప్రోత్సహించడం, వారి ఆలోచనల నుంచి అనేక సమాజ ఉపయుక్త పరిష్కారాలను తీసుకురావడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని అన్నారు. కార్యక్రమంలో ఐటీ విభాగాధిపతి ఆచార్య కుంజం నాగేశ్వరరావు, ఆచార్య వి.వల్లి కుమారి, డాక్టర్ జి. లావణ్య దేవి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ–హాబ్ సీఈవో రవి ఈశ్వరపు, డిజి ఫాక్ సీఈవో అమల్ రాజ్ తదితరులు ప్రసంగించారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న