వైఐ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థుల విజ్ఞానయాత్ర

విశాఖపట్నం > డా.వేదుల నరసింహం



సీఐఐ - యంగ్‌ ఇండియన్స్‌ (వైఐ) ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థులకు విజ్ఞానయాత్ర కార్యక్రమం చేపట్టారు.  సీఐఐ యువ విభాగమైన యంగ్‌ ఇండియన్స్‌ (వైఐ) సమాజంలో సమానత్వానికి పునాదిని వేసే ప్రయత్నాలలో భాగంగా, హైదరాబాద్‌ విభాగంతో  విశాఖపట్నం చాప్టర్‌ కలిసి హైదరాబాద్‌కి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థినీవిద్యార్థులను విశాఖపట్నానికి ఆహ్వానించింది. పిల్లలను హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కి తీసుకెళ్లి, షిప్‌ బిల్డింగ్‌ ప్రక్రియను చూపించారు.  విభిన్న ప్రతిభావంతులు కూడా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో ఎలా రాణిస్తున్నారో ప్రత్యక్షంగా చూపించారు.   టీయు142 విమాన మ్యూజియం, సీ హారియర్‌ మ్యూజియం,  సబ్‌మెరైన్‌ మ్యూజియాలను దివ్యాంగులు సందర్శించారు. దీంతో భారత నావికాదళ వారసత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వారికి లభించింది.  ఈ కార్యక్రమానికి వైఐ విశాఖపట్నం అక్సెసిబిలిటీ చైర్‌ రమీలా బండి నాయకత్వం వహించారు. వైఐ సభ్యులు విరాట్‌ మహేశ్వరి, రోహిత్‌ కంచర్ల ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న