యూత్ పార్లమెంట్ లో ఏపీ విజయకేతనం
జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ లో ఏపీ విజయకేతనం
న్యూఢిల్లీ > డా.వేదుల నరసింహం
జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. ఉత్తమ జవాబు కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వి. లాస్య ప్రియ గెలుపొందారు. చక్కటి సమాధానంతో లాస్య అందరి మన్ననలు పొందారు. ఈ నెల రెండు, మూడు తేదీలలో పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో జరిగిన జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ నుండి లాస్య, శివానీ . జ్యోత్స్న పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 110 మంది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒక్కొక్క రాష్ట్రం నుండి ముగ్గురు ప్రతినిధులను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ముగ్గురు విశాఖపట్నం నోడల్ ఏరియాకు చెందిన వారు కావడం గమనార్హం. వారిలో లాస్య ప్రియ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచారు. నాలుగు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలకు కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జ్ఞాపిక, ప్రశంస పత్రాలను అందజేశారు. నెహ్రూ యువ కేంద్ర (ఎన్.వై.కె) జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ ను విజయవంతంగా నిర్వహించింది. ఎన్.వై.కె. ఉప సంచాలకులు జి. మహేశ్వరరావు విజేత లాస్యకు శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి