గణిత శాస్త్ర విభాగంలోని సీనియర్ విద్యార్థులకు ఫేర్వెల్
గణిత శాస్త్ర విభాగంలో ఫేర్వెల్ ఉత్సవా లు
విశాఖపట్నం > డా.వేదుల నరసింహం
ఆంధ్ర యూనివర్సిటీ, గణిత శాస్త్ర విభాగంలోని సీనియర్ విద్యార్థులకు ఫేర్వెల్ ఫంక్షన్ ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రముఖ అంతర్జాతీయ మోటివేషన్ స్పీకర్, అయినా లక్ష్మీపురం వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఏ రకంగా గోల్స్ ఏర్పాటు చేసుకోవాలో ఉదాహరణలతో వివరించారు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని దానిని అందంగా మలుచుకునే శిల్పి మీరే అని తెలియజేశారు. ముఖ్య అతిథిగా కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.ఆర్ రాజు మాట్లాడుతూ జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్, నిబద్ధత, సమయ పాలన మొదలగునవి అలవాటు చేసుకోవాలని హితువు పలికారు. గణిత శాస్త్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ అనురాధ కామేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పిడిఎన్ శ్రీనివాస్, ప్రొఫెసర్ జి.నానాజీరావు, ప్రొఫెసర్. ఎస్. రవికుమార్, ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ ఎన్. రామకృష్ణ మరియు పరిశోధక విద్యార్థులు , విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ అనంతరం సంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి