సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎత్నిక్ డే

సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా                                                                                     ఎత్నిక్ డే

విశాఖపట్నం > డా.వేదుల నరసింహం

 


సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ సిస్టం ఇంజనీరింగ్ విభాగంలో ఎత్నిక్ డే నిర్వహించారు. శుక్రవారం విభాగంలో విద్యార్థులు, అధ్యాపకులు సాంప్రదాయ వస్త్రధారణలో ఎత్నిక్ డే వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏ.యూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ హాజరై విద్యార్థులను అభినందించారు. మన సంస్కృతులను, సాంప్రదాయాలను అనుసంధానం చేస్తూ ప్రజలందరిని ఐక్యం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విద్యార్థులకు స్వయంగా వైస్ ఛాన్సలర్ కవిత చదివి వినిపించారు. అనంతరం విభాగ విద్యార్థులు పరిశోధకులతో ఆయన ముచ్చటించారు. పరిశోధకులు తాము చేస్తున్న పరిశోధనలను వైస్ ఛాన్సలర్ కు వివరించారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడుతూ వారు ఇంటర్న షిప్ చేస్తున్న విధానం, అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, విభాగాధిపతి ఆచార్య కె.వెంకట రావు, ఆచార్య శశి, ఆచార్య లావణ్యదేవి, ఆచార్య వల్లికుమారి, విభాగాచార్యులు, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న