ఓర్పు, సమన్వయం, సమయపాలన ఎంతో అవసరం
సామజిక సేవతోనే నిజమైన సంతృప్తి
- ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహారావు
విశాఖపట్నం > డా. వేదుల నరసింహం
సామజిక సేవ ద్వారానే నిజమైన సంతృప్తి ఉంటుందని ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ.నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం వర్సిటీ లోని టిఎల్ఎన్ సభా ప్రాంగణం లో సోషల్ వర్క్ విభాగం ద్వితీయ సంవత్సరo విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధి గా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ.నరసింహారావు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు క్రమశిక్షణ తో నడుచుకుంటూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. సమాజం లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలంటే ఓర్పు, సమన్వయం, సమయ పాలన ఎంతో ముఖ్యం అన్నారు.
సోషల్ వర్క్ విభాగ అధిపతి ప్రొఫెసర్ ఎస్. హరనాధ్ మాట్లాడుతూ విద్యార్థులు అంకిత భావం తో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. పోటీ ప్రపంచం లో రాణించాలంటే విజ్ఞానం తో పాటు సామాజిక స్పృహ కూడా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అతిధి అధ్యాపకులు డాక్టర్ పుష్ప లత, శ్యాంకుమార్, ఆశాకిరణ్, లక్ష్మణరావు, శిరీష, అమిత, సూరిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి