మధుమేహంపై పరిశోధనకు దాసరి సురేఖ అరవలమ్మ కు డాక్టరేట్
హ్యూమన్ జెనెటిక్స్ విభాగంలో దాసరి సురేఖ కు డాక్టరేట్
ఆంధ్ర విశ్వవిద్యాలయం హ్యూమన్ జెనెటిక్స్ విభాగం నుంచి దాసరి సురేఖ అరవలమ్మ కు డాక్టరేట్ లభించింది. ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను ఈరోజు సురేఖ స్వీకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జన్యు శాస్త్ర విభాగం సీనియర్ ఆచార్యులు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా సేవలందిస్తున్న ఆచార్య జి. సుధాకర్ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లాలోని గర్భస్థ మధుమేహం టైప్ టు మధుమేహం కలిగిన మహిళల మధ్య జన్యుపరమైన సారూప్యతలు, వ్యత్యాసాలపై చేసిన పరిశోధనకు గాను సురేఖకు డాక్టరేట్ లభించింది. తన పరిశోధనలో భాగంగా 600 మంది పై రోగులలో గర్భస్థ మధుమేహం టైప్ టు మధుమేహంల సారూప్యతలను, వ్యత్యాసాలను జన్యుపరమైన అంశాలపై అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా సురేఖను హ్యూమన్ జెనెటిక్స్ విభాగాధిపతి ఆచార్య వి. లక్ష్మి విభాగాచార్యులు, పరిశోధకులు అభినందించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి