క్వాంటం సైన్సును కరికులం లో భాగం చేయాలి

 

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ పై మేధో చర్చ


విశాఖపట్నం > డా.వేదుల నరసింహం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో  క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ  అంశంపై ఆన్లైన్ రౌండ్ టేబుల్ మేధో చర్చ నిర్వహించారు కార్యక్రమానికి ఐఐటి ఖర్గపూర్ కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుదేబ్ కుమార్ ప్రశాంత్ పాల్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. క్వాంటం సైన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ, విభిన్న విభాగాలు సమిష్టిగా కలిసి పని చేయాలని సూచించారు. దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం చొరవ చూపుతూ విభిన్న రంగాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి మేధో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్వాంటం సైన్సును కరికులం లో భాగం చేయాలని తెలిపారు.

 కార్యక్రమంలో ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రకటించిందని, అదే విధంగా ఉన్నత విద్యా మండలి సైతం క్వాంటం సైన్స్ కు ప్రాధాన్యత కల్పించాలని సూచించినట్లు తెలిపారు. జాతీయ క్వాంటం మిషన్ కు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ నిర్మించారని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో సైతం దీన్ని అభివృద్ధి చేసేదిశగా విద్యార్థులు అవగాహన కల్పించడం, పరిశోధకులను చైతన్యవంతం చేయడం, దీనికి అనుగుణంగా మౌలికపరమైన వ్యవస్థ నిర్మాణాన్ని చేయడం సదస్సు ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. క్వాంటం సైన్స్ రంగంలో విభిన్న ఇంజనీరింగ్ సైన్స్ విభాగాలు సమిష్టిగా కలిసి పని చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య కె.వెంకట రావు సమన్వయం చేశారు. సదస్సులో జేఎన్టీయూహెచ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.విశ్వనాథరాజు, పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ గోయల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రుక్మా రేఖ, జేఎన్టీయూ ఆచార్యులు డాక్టర్ సుమలత, డాక్టర్ జయసుమ, ఏయు ఆచార్యులు ఎం.శశి, వి.వల్లి కుమారి, డి.లలిత భాస్కరి, జి. లావణ్య దేవి, డాక్టర్ కేవీ రమణ, డాక్టర్ ఎస్.ఝాన్సీ రాణి, స్టాటస్టిక్స్ నుంచి ఆచార్య వి.మునిస్వామి, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి ఆచార్య కె.రాజేంద్రప్రసాద్, ఆచార్య అనురాధ కామేశ్వరి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఆచార్య కె.రమా సుధ, క్యాప్ జెమినీ సంస్థ  డైరెక్టర్ (టెక్నాలజీ సర్వీసెస్) శ్రవణ్ మేడపాటి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న