వైవిధ్యతను ఏకం చేసేది ప్రజాస్వామ్యం

 వైవిధ్యతను ఏకం చేసేది ప్రజాస్వామ్యం

విశాఖపట్నం > డా.వేదుల నరసింహం




వైవిధ్యతను ఏకం చేసేది ప్రజాస్వామ్యమని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ సెంటర్ ఫర్ యూరోపియన్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శీతల్ శర్మ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యూరోపియన్ యూనియన్ సహకారంతో ఇనిస్టిట్యూట్ ఫర్ డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ అండ్ అకౌంట్ సమన్వయంతో నిర్వహించిన ఒకరోజు అంతర్జాతీయ సదస్సు భారత్- యూరప్ దేశాలలో ప్రజాస్వామ్యం, వైవిధ్యత మార్పులు ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి భాగస్వామ్యం జవాబుదారితనం పరిపాలనలో ఉండాలని సూచించారు సాధికారత అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలని చెప్పారు. కేయూ పొలిటికల్ సైన్స్ విభాగ విశ్రాంత ఆచార్యులు కే రవి మాట్లాడుతూ 450 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని కేవలం మూడోవంతు దేశాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని యూరప్ దేశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం సాధన వెనక ఎన్నో త్యాగాలు ఉంటాయని విషయాన్ని మర్చిపోకూడదని చెప్పారు భారత యూరప్ దేశాల మధ్య ఉన్న సారు పేదలను వైవిధ్యాతలను ఆచార్య వ్యవహారాలను వివరించారు భారత్లో అధికారికంగా 14 భాషలు ఉండగా 1650 కి పైగా భాషలు వాడుకలో ఉన్నాయని చెప్పారు. సంస్కృతుల సారూప్యత వివరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపకులపతి ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల సునీత విలియమ్స్ పాత్రికేయలతో మాట్లాడుతూ భారతదేశం ఎంతో సుందరంగా ఉంటుందని ఇది ఒక పెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పిన సందర్భాన్ని వివరించారు. 

సదస్సు కన్వీనర్ ఆచార్య పేటేటి ప్రేమానందం మాట్లాడుతూ సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని ప్రాధాన్యతను వివరించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తోందని తెలిపారు. దశాబ్దాలుగా ప్రజాస్వామ్య విలువలను అన్ని రంగాలలో మనం కలిగి ఉన్నామని అన్నారు దీన్నే పరిరక్షిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు భాష సాహిత్యం సామాజిక మార్పులు చాలా కీలకంగా నిలుస్తాయని అన్నారు కార్యక్రమంలో రీజనల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ టీ అనిల్ కుమార్ సదస్సు కో కన్వీనర్ డాక్టర్ షేక్ సులేమాన్, డాక్టర్ టి నాగరాజు, డాక్టర్ కే సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న