స్ఫూర్తి ప్రదాత... అందుకో మా నివాళి...

 

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

ఓర్పు, సహనం, త్యాగం  అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి

దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల మరియు  పరిపాలన భవనం వద్ద నున్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాతగా, మార్గదర్శిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలుస్తారని అన్నారు అకుంఠిత దీక్షతో ఉన్నత శిఖరాలను ఆయన అధిరోహించాలని చెప్పారు. ఆయన బాటలో పయనిస్తూ ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఓర్పు, సహనం, త్యాగం వంటి లక్షణాలను అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాలని చెప్పారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఒక ప్రత్యేక కవితను స్వయంగా రాసి సభలో ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ చదివి వినిపించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ ఆచార్య బళ్ల అప్పారావు మాట్లాడుతూ 107 దేశాలలో అంబేద్కర్ జయంతిని నిర్వహించుకుంటున్నారని చెప్పారు ఆర్బిఐ స్థాపనకు దేశ ఆర్థిక పరిస్థితి బలోపేతానికి అంబేద్కర్ ఆలోచనలే కారణమని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఏయు ఎస్సీ ఎస్టీ బీసీ సి టీచర్స్ ఎంప్లాయిస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి. షారోన్ రాజు ఏయూ వైస్ ఛాన్సలర్ జి.పి రాజశేఖర్ కు బహుకరించారు.

కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య నరసింహారావు, ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, ఆచార్య జి శశిభూషణరావు, ఆచార్య కే.సీతామాణిక్యం, ఆచార్య జి. గిరిజ శంకర్, ఆచార్య బి.నగరాజా కుమారి, దూరవిద్య సంచాలకులు ఆచార్య ఎన్.విజయ మోహన్, అకాడమిక్ డీన్ ఆచార్య కె.ఈశ్వర్ కుమార్ ఎస్సీ,ఎస్టీ బీసీసీ టీచర్స్, ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆచార్య టి. షారోన్ రోజు, ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య ఎస్. హరినాథ్, ఆచార్య కె.జాన్, పలువురు విశ్రాంత ఆచార్యులు, పలువురు పరిశోధకులు, విద్యార్థులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.


విశాఖపట్నం > డా.వేదుల నరసింహం



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న