చిన్నారుల్లో విభిన్న నైపుణ్యాలను పెంపొందించాలి
చిన్నారుల్లో విభిన్న నైపుణ్యాలను పెంపొందించాలి
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐఏఎస్ఈ, ఏయూ విద్యావిభాగంతో సంయుక్తంగా #జాతీయ విద్యా విధానం 2020 - సహిత విద్యలో నూతన బోధనా పద్ధతులు# అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల పునరావాస విద్యా కార్యక్రమం (అధ్యాపకుల పునఃశ్చరణ తరగతుల) ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐఏఎస్ఈ ప్రిన్సిపల్ ఆచార్య డి.నగరాజా కుమారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య నగరాజ కుమారి మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారుల్లో విభిన్న నైపుణ్యాలను పెంపొందించే దిశగా అధ్యాపకుల కృషి చేయాలని అన్నారు. వివిధ శారీరక, మానసిక వైకల్యం కలిగిన దివ్యాంగ చిన్నారులు తమ జీవనం సాగించడానికి ఉపయుక్తంగా నిలిచే నైపుణ్యాలను వారిలో పెంపొందించడానికి అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రెండు రోజుల శిక్షణా తరగతులలో నిపుణులు అందించే సూచనలను ఆచరణలో చూపుతూ తమ బోధన సామర్ధ్యాలను పెంపొందించుకోవాలని అధ్యాపకులకు ఆమె సూచించారు.
సదస్సు కోఆర్డినేటర్ ఏయు విద్యా విభాగాధిపతి ఆచార్య టి షారోన్ రాజు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారుల కోసం వారిలో అవసరమైన బహుళ నైపుణ్యాలను పెంపొందించడానికి పలు సాంకేతిక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటి ఉపయోగాలను వివరిస్తూ, వీటిని వినియోగించి తమ భావాలను తెలిపే విధంగా విద్యార్థులకు శిక్షణ అందించాలని అధ్యాపకులకు సూచించారు.
కార్యక్రమంలో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్.సి.ఐ_న్యూఢిల్లీ) పూర్వ సభ్యులు ఆర్. రంగనాథన్, డాక్టర్ ఎం.ప్రభాకర్ రావు, డాక్టర్ మదన్ మోహన్, డాక్టర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్.సి.ఐ సభ్యత్వం కలిగిన 50 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ కోసం హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యావిభాగం, ఐఏఎస్ఈ అధ్యాపకులు పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి