తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి
తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి
ఏయు సోషల్ వర్క్ విభాగాధిపతి ప్రొఫెసర్ - S. హరనాధ్
విశాఖపట్నం > డా. వేదుల నరసింహం
విద్యార్థులు తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఆంధ్రాయూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగధిపతి ప్రొఫెసర్ S. హరనాధ్ సూచించారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ తరపున సుమారు ఐదు వేల రూపాయలు విలువ చేసే పోటీ పరీక్షల పుస్తకాలను నిర్వాహకులు శుక్రవారం సోషల్ వర్క్ విభాగానికి అందజేశారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ హరనాధ్ మాట్లాడుతూ సామాజిక ప్రగతిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, అంకిత భావంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు . ఈ సందర్బంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ నిర్వాహకుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ వైస్ గవర్నర్లు పివిఎస్ఎన్ వి. సాంభమూర్తి,కెఎస్. రామారావు,నటరాజ్ క్లబ్ అధ్యక్షులు గరుడ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి