ఈనెల 25న "చౌర్య పాఠం"

 ఈనెల 25న  "చౌర్య పాఠం"

- దొంగతనం,హాస్యం  కథాంశంతో  ప్రేక్షకుల ముందుకు 

దొంగతనం చేయడం వల్ల  ఎదురయ్యే పరిణామాలను  హాస్యభరితంగా  వివరించే క్రమంలో  నిర్మించిన చిత్రం "చౌర్య పాఠం" అని  చిత్ర దర్శకుడు  నిఖిల్ గొల్లమారి అన్నారు. చౌర్య పాఠం చిత్రం  ఈనెల 25న  థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే  సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, హీరో హీరోయిన్లతో పాటు  చిత్ర యూనిట్  నగరంలోని  ఒక గెస్ట్ హౌస్ లో  ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..  తమ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.  చిత్ర నిర్మాత  త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. తాను గతంలో  ధమాకా చిత్రానికి, ఇతర చిత్రాలకు దర్శకుడుగా పనిచేశానని తెలిపారు. అయితే ఈసారి దర్శక బాధ్యతలను నిఖిల్ కు అప్పగించి తాను నిర్మాతగా తొలిసారి వ్యవహరిస్తున్నానని తెలిపారు. తాము ముందు చిత్రానికి టైటిల్ ఏది నిర్ణయించుకోలేదని   చిత్ర నిర్మాణం దాదాపుగా పూర్తయిన తర్వాత దర్శకుడు  నిఖిల్ సూచనతో  "చౌర్య పాఠం" పేరును ఖరారు చేశామన్నారు. 

 హీరో ఇంద్ర రామ్ మాట్లాడుతూ..టన్నెల్  ( సొరంగం ) లో దొంగతనం ఎపిసోడ్ తో వినూత్నంగా , హాస్య భరితంగా  చిత్రం రూపొందించామన్నారు.  హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రంలో   బ్యాంకు ఉద్యోగిగా పనిచేసే  తాను  దొంగల ముఠాలో  అనుకోకుండా చేరిన సభ్యురాలి పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందన్నారు. తనకు ముందు తెలుగు సరిగ్గా వచ్చేది కాదని  అయితే చిత్ర నిర్మాణం పూర్తి అయ్యేసరికి పూర్తిస్థాయిలో తెలుగు భాషలో మాట్లాడగలుగుతున్నానని తెలిపారు.  ఈనెల 25న  ప్రేక్షకుల ముందుకు రానున్న తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. రాప్ సింగర్ రోల్ రిడా మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు అనేక చిత్రాలలో  పాటలు పాడానని, చౌర్య పాఠం చిత్రంలో హుషారుగా సాగే పాట ఇప్పటికే  మంచి ప్రాచుర్యం పొందిందన్నారు.

 గ్రామ పెద్ద పాత్రలో రాజీవ్ కనకాల .....

చౌర్య పాఠం చిత్రంలో గ్రామ పెద్ద పాత్ర పోషించిన రాజీవ్ కనకాల మాట్లాడుతూ తనకు విశాఖ తో  ఎంతో అనుబంధం ఉందన్నారు. విశాఖ ఎక్స్ ప్రెస్ తో పాటు పలు చిత్రాలలో   హీరోగా  విలన్ గా, వివిధ రకాల పాత్రలతో  ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యానని తెలిపారు. చౌర్య పాఠం చిత్రంలో తన పాత్ర గతంలోని పాత్రల కంటే విభిన్నంగా ఉంటుందన్నారు. తనకు మంచి అవకాశం కల్పించిన  చిత్ర నిర్మాత త్రినాథ రావుకు, దర్శకుడు నిఖిల్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న