వ్యర్ధాల నిర్వహణ... పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరం

 స్వచ్ఛత నిత్యజీవితంలో భాగం కావాలి 


విశాఖపట్నం, ఏప్రిల్ 19:

స్వచ్ఛతను ఒక అలవాటుగా చేసుకోవాలని అప్పుడే మార్పు సాధ్యపడుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు అన్నారు. శనివారం ఉదయం ఏయు విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆర్ట్స్ కళాశాల పరిసరాలలోని వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రజల్లో స్వచ్ఛత పట్ల అవగాహన పెంచడం, వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ఎంతో అవసరమని చెప్పారు. భవిష్యత్ అధ్యాపకులుగా మారే మీరంతా పాఠశాల స్థాయి నుంచి చిన్నారుల్లో స్వచ్ఛత యొక్క ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో స్వచ్ఛతను ఒక అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

విద్య విభాగాధిపతి ఆచార్య టి. షారోన్ రాజు మాట్లాడుతూ విద్యా విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ క్యాంపస్ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్న విధానాన్ని వివరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును స్వీకరిస్తూ తమ విభాగ విద్యార్థులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పరిసరాలను, కళాశాలను పరిశుభ్రంగా ఉంచే ప్రక్రియలో నిమగ్నమవుతున్నారని తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, హరిత ఆంధ్ర లక్ష్యాలను సాకారం చేసే దిశగా ప్రతి వ్యక్తి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో యువత ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రత్యేక ఉత్తర్వులను ఇవ్వడంతో పాటు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు.


ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ రావు, డాక్టర్ ఆలీ, డాక్టర్ సాల్మన్ రాజు, డాక్టర్ రాము, డాక్టర్ ప్రవీణా దేవి, డాక్టర్ మూర్తి, విద్యార్థులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బొటుకు రమేష్ బాబుకు న్యాయ శాస్త్రంలో డాక్టరేట్

చిత్ర కళ...భళా...

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న