చెత్త వెయ్యకండి– స్వచ్ఛతకు తోడ్పడండి
స్వచ్ఛ ఆంధ్ర మనందరి కర్తవ్యం
స్వచ్ఛ ఆంధ్ర మన అందరి కర్తవ్యమని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ. నరసింహారావు అన్నారు. శనివారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గ్రంథాలయం వద్ద నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర –స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం వాలంటీర్లు వివిధ విభాగాల విద్యార్థులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రాంగణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్లు, కవర్లను తొలగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ వృధాను తగ్గించడం– శుభ్రతను పెంచడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు పరిశుభ్రంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
జాతీయ సేవా పథకం సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్ మాట్లాడుతూ చెత్త వెయ్యకండి– స్వచ్ఛతకు తోడ్పడండి అనే నిదానదంతో జాతీయ సేవా పథకం విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ విభాగ అధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి