పోస్ట్‌లు

vizag dialogue

అమెరికా వీసా నిబంధనలలో మార్పులు

చిత్రం
 అమెరికా వీసా నిబంధనలలో మార్పులు - విద్యార్థి వీసాలలో 50 శాతం కోత - ప్రత్యామ్నాయంగా ఈబీ-5 మార్గం  విశాఖపట్నం, ఫిబ్రవరి 10, 2026:  అమెరికా వీసా నిబంధనలలో పెను మార్పులు సంభవించాయని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బీచ్‌రోడ్డులో ఉన్న ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసే ఎఫ్-1 వీసాల్లో 50 శాతం తగ్గుదల నమోదైందన్నారు. హెచ్-1బీ వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డ్ కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘ కాలం దృష్ట్యా, భారతీయులకు 'ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్' ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక చర్చల్లో ఇమ్మిగ్రేషన్ ప్రధానాంశంగా ఉందన్నారు. దీనివల్ల భారత్ గణనీయంగా ప్రభావితమవుతోందన్నారు. విద్యార్థి, పని వీసాల నుంచి గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ల వరకు భారతీయ దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన తనిఖీలను, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అర్థ...

విశాఖపట్నంలో తీరప్రాంత విలాసానికి సరికొత్త చిరునామా

చిత్రం
 విశాఖపట్నంలో తీరప్రాంత విలాసానికి సరికొత్త చిరునామా   ది లైట్ హౌస్ బార్ సముద్రపు అలల సవ్వడితో, ఆహ్లాద‌క‌ర‌మై వాతావరణంతో అలరారే విశాఖ నగరంలో, సాయంత్రాలను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు 'ది లైట్ హౌస్ బార్' సరికొత్త హంగులతో మన ముందుకు వచ్చింది. పురాతన లైట్ హౌస్ స్ఫూర్తితో, ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ బార్, తీరప్రాంత జ్ఞాపకాలను మరియు నేటి కాలపు విలాసాన్ని కలగలిపి అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని ది పార్క్ హోట‌ల్ విశాఖ‌ప‌ట్నం జ‌న‌ర‌ల్  మేనేజ‌ర్‌ జయదీప్ బిస్వాస్ తెలిపారు. వెచ్చని రంగులు మరియు నౌకాదళ శైలి అలంకరణలతో మెరిసిపోయే ఈ బార్, సముద్రతీరపు అందాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ఆకర్షణీయంగా ఉండి, వినసొంపైన సంగీతం మరియు సముద్రపు గాలితో అతిథులకు ఒక మధురమైన అనుభవాన్ని పంచుతుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి విశిష్టమైన కాక్‌టెయిల్స్. నాణ్యమైన స్పిరిట్స్‌తో పాటు మన ప్రాంతీయ సుగంధ ద్రవ్యాలు మరియు పదార్థాలైన నిమ్మ, కొబ్బరి, బెల్లం మరియు వైట్ టీ వంటి వాటిని జోడించి పానీయాలు తయారుచేస్తారు. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటూనే, మన తీరప్రాంత రుచులను గుర్తుచేస్...

ఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ

చిత్రం
  ఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ - ఏఐ పోర్టెరైట్ కెమెరా, పూర్ టోన్ టెక్నాలజీ - పాపౌట్ ఫీచర్లతో ట్రావెల్ ఫొటోగ్రఫీకి చిరునామా      విశాఖపట్నం, జనవరి 21:  ఒప్పో ఇండియా ఈ రోజు తన ప్రీమియం రెనో15 సిరీస్‌ను మూడు వేరియంట్‌లతో రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ,  రెనో15 ఆవిష్కరించింది. బీచ్‌రోడ్డులో ఒక హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కొత్త సీరీస్ ఫోన్ల‌ను సంస్థ ప్ర‌తినిధులు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ యువ ప్రయాణికులు, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్లో ఆధునిక కెమెరా సిస్టమ్‌, ఇంటెలిజెంట్ ఏఐ, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. ప్రకృతి అంశాల ఇన్స్పిరేషన్ తో కలర్ ఫినిష్‌లు, ప్రపంచంలో తొలి హోలోఫ్యూజన్ టెక్నాలజీ తో, రెనో15 సిరీస్ కాంపాక్ట్, సౌకర్యవంతమైన ఆకృతిని బలమైన నిర్మాణ నాణ్యతతో కలిపి అందిస్తుంది. రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ 200ఎంపీ కెమెరాతో ఫోటోగ్రఫీని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. అద్భుతమైన క్లారిటీని అందిస్తాయి. దీన్ని 50ఎంపీ 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్,  120ఎక్స్ డిజిటల్ జూమ్, పూర్ టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఏఐ ఎ...

ఏయూలో మెస్‌లు పూర్తిస్థాయిలో ప‌నిచేస్తున్నాయి

చిత్రం
  ఏయూలో మెస్‌లు పూర్తిస్థాయిలో ప‌నిచేస్తున్నాయి  - హాస్ట‌ల్ మెస్‌లు మూసివేయ‌లేదు -అస‌త్య ప్ర‌చారాల‌ను  న‌మ్మ‌వ‌ద్దు ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జ‌న‌వ‌రి 21: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యంలో విద్యార్థుల మెస్‌లు అన్నీ పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయ‌ని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మెస్‌లు మూసివేసార‌ని, మెస్‌ల‌కు తాళాలు వేసార‌ని వ‌స్తున్న వార్త‌లు, క‌థ‌నాలు అవాస్త‌వ‌మ‌న్నారు. సెల‌వులు అనంత‌రం హాస్ట‌ల్స్‌, మెస్‌ల‌ను పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకువ‌చ్చామ‌న్నారు. విద్యార్థుల‌కు మెస్‌ల‌లో భోజ‌నం అందిస్తున్న‌ట్లు చెప్పారు. దీనిపై కొంత మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని, వీటిని న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. విద్యార్థుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా మెస్‌ల‌లో ఉద‌యం టిఫిన్‌, మ‌ద్యాహ్నం, రాత్రి భోజ‌నం అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. విశ్వ‌విద్యాల‌యంలో సెల‌వులు ముగిసిన వెంట‌నే ఇంకా విద్యార్థుల పూర్థిస్థాయిలో వ‌ర్సిటీకి చేరుకోలేదని తెలిపారు. దీని కార‌ణంగా విద్యార్థుల‌కు కామ‌న్ మెస్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సైన్స్, ఆర్ట్స్ క‌ళాశాల‌ల ప‌రిధిలో విద్య...

వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం

చిత్రం
 వేదాంత ధార్మిక సంస్థకు భూరి విరాళం విశాఖపట్నం 24 డిసెంబర్ 2025: స్థానిక మధురవాడ లోని లాభాపేక్షలేని ప్రముఖ ధార్మిక సంస్థ వేదాంత ఇనిస్టిట్యూట్. ఇది ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ ఎ.పార్థసారధి గారి సారధ్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వేదాంత అధ్యయనాలు, పరిశోధనలు మరియు వేదాంత అంశాలు ప్రచారానికి కృషి చేస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం జాతి, మత, వర్ణ వివక్ష లేకుండా అందరికి ఆధ్యాత్మిక అంశాలు పంచటం, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఆదర్శాలు పాటించే విధంగా యువతరాన్ని ప్రేరేపించటం, ఉత్తమ మార్గం వైపు వారిని నడిపించటం కోసం వేదాంత  ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ వేదాంత చారిటబుల్ సంస్థ నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల కొరకు సిక్కు మతానికి చెందిన విశాఖపట్నం నివాసి శ్రీ సతీందర్ సింగ్ సేథీ ఈరోజు రూ.25,000/- విరాళం అందచేసారు.ఆయన విశాపట్నంలోని మూడు గురుద్వారాలలో సభ్యులుగా ఉన్నారు. పరోపకార పరాయణులు. సంస్థ నిర్వహించు రోజు వారీ సేవా కార్యక్రమాలకు ఈ విరాళం అందచేసినట్లు శ్రీ సతీందర్ సింగ్ సేథీ తెలిపారు. అంతేకాక వేదాంత సంస్థ భవిష్యత్తులో నిర్వహించు కార్యక్రమాలలో తాను కీలక పాత్రను పోషిస్తానని ఆయన చెప్పారు.ఈ సందర్భ...

న్యూలుక్‌తో నీరూస్...న‌గ‌ర‌వాసుల‌కు స‌రికొత్త అనుభూతి..

చిత్రం
  న్యూలుక్‌తో నీరూస్...న‌గ‌ర‌వాసుల‌కు స‌రికొత్త అనుభూతి.. . విశాఖన‌గ‌రంలో వ‌స్త్ర ప్రియుల‌కు స‌రికొత్త వ‌స్త్ర ప్ర‌ప‌చం క‌నువిందు చేయ‌నుంది. డ్రేప్స్-డివాస్, ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ సహకారంతో నీరు యొక్క న్యూలుక్ తో సిద్ద‌మైంది. ఎఫ్ఐసిసిఐ, ఎఫ్ఎల్ఓ ద్వారా క్యూరేట్ చేయబడిన నీరు'స్ న్యూ లుక్ ప్రత్యేక సంబరాన్ని డ్రేప్స్ & డివాస్ ప్రదర్శించిన ప్రథమమైన అనుభవజన్య ఫ్యాషన్ సాయంత్రాన్ని విశాఖపట్నం ఇటీవల సాక్ష్యంగా నిలిచింది. ఈ కార్యక్రమం నీరూస్‌ ఇండియన్ ఎథ్నిక్ వేర్ , రెడ్ మ్యాగజైన్ ఈవెంట్, మీడియా పార్టనర్ గా  వ్య‌వ‌హ‌రించింది.  సమకాలీన దృక్పథంతో తిరిగి ఊహించడంతో పాటు, ఫ్యాషన్, సంగీతం మరియు సంస్కరించబడిన సామాజిక నిశ్చయార్ధాన్ని నిరవధికంగా కలిపింది. సంప్రదాయ ఫ్యాషన్ ప్రదర్శన కంటే మించి, అతిథులకు శ్రద్ధగా క్యూరేట్ చేయబడిన అనుభవాన్ని అందించిన ఈ సాయంత్రం దాని ఎలిగెన్స్ మరియు వ్యక్తిత్వం కోసం గుర్తింపు పొందింది. సంపత్ వినాయక టెంపుల్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమం ఆధునీక‌రించిన నీరూస్‌ పునరుద్ధరించబడిన ఫ్లాగ్షిప్ స్టోర్ యొక్క కొత్త లుక్ తో ఆరంభ‌మైంది. ఈ కార్యక్రమానికి  నీరూస్  ఎం.డి అవ...

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా డా. ఎం. సృజన దేవి

చిత్రం
‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా  డా.ఎం.సృజన దేవి విశాఖ‌ప‌ట్నం, డిసెంబర్ 21, 2025: ఫ‌రెవ‌ర్ స్టార్ ఇండియా – మిస్ యూనివర్స్ ఇండియా 2025 గ్రాండ్ ఫినాలే విజేత‌గా న‌గ‌రానికి చెందిన డాక్ట‌ర్ సృజ‌న దేవి ఎంపిక‌య్యారు. ఇటీవ‌ల  జైపూర్‌లోని Z స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించిన తుది పోటీల‌లో డాక్ట‌ర్ సృజ‌న ఆల్‌రౌండ్ ప్ర‌తిభ‌తో విజేత‌గా నిల‌చారు.దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది పోటీదారుల నుంచి, 100 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. పలు దశల పోటీల అనంతరం ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, మేధస్సు, సామాజిక అవగాహనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన డా. ఎం. సృజన దేవి (ఎం.డి – అనస్థీషియా) ‘ఫారెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా విజేతగా నిలిచారు. ఈ జాతీయ స్థాయి పోటీలను సీఈఓ రాజేష్ అగ‌ర్వాల్‌ మరియు డైరెక్టర్ జ‌య చౌహాన్‌ సమర్థ నాయకత్వంలో నిర్వహించారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న డా. సృజన దేవి నేడు సాధించిన‌ విజయం, యువతకు, మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. గ్రాండ్ ఫినాలేలో డా. ఎం. సృజన దేవి కి ప్రత్యేకంగా అశ్వ‌త్థ మేకోవ‌ర్ సంస్థ, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ - మేకప్ ఆర్టిస్ట్ మిస్ రాజి పర్యవేక్షణలో స్టైలింగ్ చేసింది. ఈ ...