'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకావిష్కరణ
'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకావిష్కరణ విశాఖపట్నం 26 మార్చి 2026 : సాహిత్య సంస్కృతులకు నెలవైన విశాఖపట్నం నగరం ఈరోజు మరోసారి తన సాహిత్య సౌరభాలను వెదజల్లినది. రచయిత మరియు వెల్‌బీయింగ్ & హ్యాపీనెస్ కోచ్ అయిన ఎల్ ఎన్ హోలానీ రచించిన 'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకావిష్కరణ ఈరోజు నిర్వహించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాంబ దాస్ ప్రభుజీ, విశాఖపట్నం ఇస్కాన్ అధ్యక్షులు, గౌరవ అతిథిగా డా ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, విశాఖ వ్యాలీ పాఠశాల, ప్రత్యేక అతిధులుగా శ్రీ నిరంజన్ కుమార్ సోమాని, అధ్యక్షులు, రాజస్థానీ సాంస్కృతిక మండలి మరియు శ్రీ జయదీప్ బిస్వాస్, జనరల్ మేనేజర్, ది పార్క్ హోటల్, విశాఖపట్నం తదితర పురప్రముఖుల సమక్షంలో పుస్తక ఆవిష్కరణ చేసారు. వ్యక్తులు ఆనందం సంతోషం అనేవి మరోచోటికి వెళితేనే దొరుకుతాయి అని ఆనందాన్ని అన్వేషిస్తూ వెళుతుంటారు. కానీ నిజమైన ఆనందం మనలోనే దాగి ఉందనే సత్యాన్ని ఈ 'ది సైన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్' పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం చదివిన పాఠకులు తనని తానూ ఆత్మ పరిశీలన చేసుకునే లాగా, ఆలోచనాత్మకతను రేకెత్తిస్తుంద...