పోస్ట్‌లు

నవంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఓయాసిస్ ఫెర్టిలిటీ ‘జనని యాత్ర’ ప్రారంభం

చిత్రం
  ఓయాసిస్ ఫెర్టిలిటీ — విశాఖపట్నం నుండి ‘ జనని యాత్ర ’ ప్రారంభం   సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంచే ఉద్యమం విశాఖపట్నం , 24 నవంబర్ 2025: తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది జంటలకి ఆశను కల్పించి , అవగాహనను పెంచిన తర్వాత , భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఓయాసిస్ ఫెర్టిలిటీ , రెండో విడత ‘ ఓయాసిస్ జనని యాత్ర ’ అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని 24 నవంబర్ 2025 న విశాఖపట్నం నుండి ప్రారంభించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   ఎమ్మెల్యే   గంటా శ్రీనివాస్ గారు మరియు , ఎమ్మెల్యే   వంశీ    కృష్ణ‌  శ్రీనివాస్ గారు , అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు . ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి , తల్లిదండ్రులవాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యం తో ప్రారంభమైంది . ఆంధ్రప్రదేశ్ ‌ లో ఫెర్టిలిటీ రేటు 1.5 కి పడిపోవడం , ఇది 2.1 రీప్లేస్ ‌ మెంట్ స్థాయికి చాలా తక్కువ , ఈ ...

మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్‌

చిత్రం
  మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్‌ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం మెరైన్ ఇంజ‌నీరింగ్ విభాగ ప‌రిశోధ‌క విద్యార్థి మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కి డాక్ట‌రేట్ ల‌భించింది. విభాగ ఆచార్యులు వి.వి.ఎస్. ప్రసాద్ మార్గదర్శకత్వంలో  "కంప్యూటేషనల్ అండ్ ఎక్సపెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎన్ యానులర్ కుకింగ్ బౌల్ ఫర్ నాన్-సెంట్రిఫ్యూగల్ కేన్ షుగర్ యూనిట్ యూజింగ్ ఫుడ్-గ్రేడ్ ఆయిల్ అండ్ గ్రాఫిన్ నానోప్లేట్ లెట్ డిస్ఫర్షన్స్"  అంశంపై చేసిన పరిశోదన కు డాక్ట‌రేట్ ల‌భించింది. సాంప్ర‌దాయ విధానంలో చెరుకు పిప్పిని మండించి బెల్లం త‌యారీ జ‌రుపుతుంటారు. దీనికి ప్ర‌త్యామ్నాయ విధానాన్ని ప‌ర్య‌వార‌ణ‌హిత సాంకేతిక‌త‌ల‌ను అభివృద్ధి చేసారు. మొహమ్మద్ అబ్దుల్ రజాక్ తన పరిశోధన ఫలితాలను నాలుగు ప్రఖ్యాత అంతర్జాతీయ జ‌ర్న‌ల్స్‌లో ప్రచురించారు. ఏయూ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్  నుంచి డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న స్వీక‌రించారు.   మెరైన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు, కుటుంబ స‌భ్య‌లు అభినందనలు తెలిపారు. ప్ర‌స్తుతం అబ్దుల్ ర‌జాక్ గీతం విశ్వ‌విద్యాల‌యంలో ప‌నిచేస్తున్నారు.